Home > Editorial > మళ్లీ తెరపైకి డిటెన్షన్ విధానం

మళ్లీ తెరపైకి డిటెన్షన్ విధానం

ములాయాం పరివార్....
ఉమ్మడి అజెండాతో వాయిస్ పెంచుతున్న ప్రతిపక్షాలు

Narendra-Modi2_apduniaకేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి అత్యుత్సాహంతో ఉన్నది. పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయ స్థాయివరకు సమూల మార్పుకు సన్నాహాలు చేస్తున్నది. దీనిలో భాగంగానే స్మృతి ఇరానీ నేతృత్వంలో పాఠశాల విద్యావ్యవస్థలో సమూల మార్పులకు సన్నాహాలు ప్రారంభించారు. పాఠశాల విద్యనుంచి ఉత్తీర్ణత ప్రాతిపదికగా లేకపోవటం కారణంగా విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. కనీస విద్యా ప్రమాణాలు లేకుండానే పై తరగతులకు చేరుకుంటూ ఉంటే అంతిమంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమవుతున్నదని అన్నారు. అందుకోసం ఐదో తరగతి నుంచే డిటెన్షన్ విధానం తప్పనిసరి అంటున్నారు. దానిలో భాగంగానే దేశంలోని 19 రాష్ర్టాల విద్యామంత్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యావంతులు, స్వచ్ఛంద సంఘాలతో ఢిల్లీలో విస్తృత సమావేశం ఏర్పాటుచేసింది. పాఠశాల విద్య నుంచి డిటెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు పావులు కదుపుతున్నది. దీనికోసం అవసరమైన ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009, సెక్షన్16కు సవరణలు చేయడానికి సమాయత్తమవుతున్నది. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ అంశాన్ని న్యాయ మంత్రిత్వ శాఖకు కూడా పంపింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనలకు న్యాయమంత్రిత్వ శాఖ సైతం హడావుడిగా ఆమోదం తెలిపింది.
సమాజాభివృద్ధికి విద్యను గీటురాయిగా చెబుతూ ప్రభుత్వాలన్నీ నిర్బంధ ప్రాథమిక విద్యకు అధి క ప్రాధాన్యమిచ్చాయి. బడి బయట ఉన్న బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేరేందుకు అనేక పథకా లు ప్రవేశపెట్టాయి. దీనిలో భాగంగానే కేంద్రం సర్వశిక్షా అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలు కోసం కేంద్రం 65 శాతం నిధులు భరిస్తుండగా, రాష్ట్రం మిగతా 35 శాతం నిధులు సమకూర్చి పిల్లలందరూ బడిలో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడుగా రాష్ట్రస్థాయిలో కూడా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ పేరిట పథకాలు అమలు జరుగుతున్నాయి. సామాజికంగా వెనుకబడిన వివిధ సామాజిక సమూహాలు, నిరుపేదవర్గాల పిల్లలు బడిలో చేరేందుకు ప్రోత్సహించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వాలకు భిన్నంగా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యావ్యవస్థపై శీతకన్ను వేసినట్లుగా కనిపిస్తున్నది. ఈ కొత్త ప్రతిపాదనల వల్ల ఐదవ తరగతి నుంచే డిటెన్షన్ విధానాన్ని అమలు చేస్తారు. దీని ప్రకారం సంబంధిత తరగతిలో విద్యార్థి ఉత్తీర్ణుడు కాలేకపోతే, ఆ విద్యార్థి పై తరగతికి అనర్హుడవుతాడు. తిరిగి ఆ విద్యార్థి ఆ తరగతి చదువాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఎనిమిదవ తరగతి నుంచి డిటెన్షన్ విధానం అమలులో ఉన్నది. ఈ విధానాన్నిప్పుడు ప్రాథమిక విద్యస్థాయి నుంచి అమలు చేయడానికి కేంద్రం సన్నద్ధమవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నది.సర్వశిక్షా అభియాన్‌లో కేంద్రం తన వాటాగా యాభై శాతం మాత్రమే భరిస్తుందని రాష్ర్టాలకు వర్తమానం పంపింది. అలాగే వివిధ రూపా ల్లో కొనసాగుతున్న పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల నిర్వహణకు నిధులలో కోత విధించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న 192 ఆదర్శ పాఠశాలలు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటూ సమస్యల నిలయాలుగా మారాయి. మరోవైపు పాఠశాల విద్యపై చేపట్టాల్సిన సంస్కరణలపై 2012లో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికీ తన నివేదికను సమర్పించకపోవటం ఏలికల చిత్తశుద్ధిని తెలుపుతున్నది. ప్రాథమికస్థాయిలో ఉత్తీర్ణుడు కాలేకపోయిన విద్యార్థులకు తగిన ప్రోత్సాహమిచ్చి విద్యా నైపుణ్యాలు పెంచాలి. వారిని బడికి దూరం కాకుండా చూడాలి. కానీ డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలనుకుంటే అది సంపూర్ణ అక్షరాస్యతా నినాదానికి గొడ్డలి పెట్టవుతుంది.రాష్ట్ర ప్రభుత్వాల విద్యా మంత్రులం తా నూతన డిటెన్షన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 13 అంశాలు ప్రాతిపదికగా అన్నిరాష్ర్టాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే కొత్త విధానానికి తుది రూపమిచ్చి అమలు చేస్తామ ని కేంద్రం హామీ ఇచ్చింది.ప్రాథమిక స్థాయిలో విద్యార్థి ఉత్తీర్ణుడు కాలేద నే కారణంతో డిటెన్షన్ చేస్తే అతన్ని విద్య నుంచి దూరం చేసినట్లవుతుందని విద్యావేత్తలంతా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తరఫున విద్యా మంత్రి కూడా సూత్రబద్ధంగా ప్రాథమికస్థాయి నుంచి డిటెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లిఖిత పూర్వకంగా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *