Home > Crime > పోలీస్ పహారా నడుమ రైలులోనే భార్యతో రాసలీలలు

పోలీస్ పహారా నడుమ రైలులోనే భార్యతో రాసలీలలు

దొంగతనం అంటగట్టారని విద్యార్థిని ఆత్మహత్య
సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని పిలిచాడు.. గదిలో బట్టలు మార్చడాన్ని వీడియో తీశాడు

musthafa_apduniaముంబై పేలుళ్ల కేసులో దోషి, యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ముస్తఫా దొస్సా రాసలీలలకు సహకరించిన పోలీసుల తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీరియస్ అయ్యారు. రైలులో ముస్తఫా దొస్సా జరిపిన శృంగారంపై విచారణ మొదలైంది. దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు అయిన ముస్తఫాను ఓ కేసు విచారణ కోసం పోర్ బందర్ తరలిస్తున్న వేళ ముంబైలోని అతని అనుచరులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌కు వచ్చారని, రైలు అహ్మదాబాద్ చేరుకున్న వెంటనే ముస్తఫా భార్య షబీనాను రైలెక్కించారని సమాచారం. ఆపై ముస్తఫా, భార్య షబీనా రైలులోనే రాసలీలలు కానిచ్చారు. అంతేగాకుండా ముస్తఫా, ఆయన భార్య సన్నిహితంగా ఉన్న ఫొటోలు సైతం బయటకు పొక్కడంతో పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముస్తఫా, షబీనా ఏకాంతానికి పోలీసులు సహకరించారని, తెల్లారే వరకు రైలు తలుపుల వద్దే నిలబడ్డారని ఆరోపణలు వచ్చాయి. రైలు గమ్యం చేరుకున్న తర్వాతే తిరిగి బోగీలోకి పోలీసులు వెళ్ళినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సీఎం ఫడ్నవీస్ ఫైర్ అయ్యారు. వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *