Home > Bhakti > అన్నమో… వెంకన్న

అన్నమో… వెంకన్న

రికార్డ్ స్థాయిలో శబరిమల ఆదాయం
వచ్చే ఏడాది శని ప్రభావం....

tirumala-apduniaతిరుమలలో ఎక్కడా అన్నం దొరకడం లేదా. అన్నం దొరకపోవడానికి ఎవరి నిర్లక్షం ఎంత ఉంది. అస్సలు భక్తులు ఆహార పదార్థాల కోసం అగచాట్లు పడుతుంటే అంత పెద్ద దేవస్థానం ఏం చేస్థున్నది. అంత అధికార వ్యవస్థ చేతులు ముడుచుకుని కూర్చున్నారా…ఏంటి. అస్సలు ఇంతగా భక్తులు ఆహార పదార్థాల కోసం అవస్థలు పడటానికి కారణాలు ఏంటి వాచ్ దిస్ మహా స్టోరీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్షేత్రాల్లో తిరుమల ఒకటి. అక్కడి వెలసిన స్వామి వారు శక్తి యుక్తులు అన్నీ ఇన్నీ కావు. అవి తిరుమల భక్తులు అడిగితేనే తెలుసు. నిత్యం లక్ష మంది భక్తుల దర్శనం. అంటే నెలకు దాదాపు 25 నుండి 30 లక్షల మంది… ఇక సంవత్సరంలో లెక్కిస్తే 3కోట్ల మందికి దర్శన భాగ్యం ఇస్తున్నారు స్వామి వారు. ఇక ప్రతి ఏటా తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి… ఆ బ్రహ్మోత్సవాల్లో ఇక చెప్పాల్చిన పనే లేదు. బ్రహ్మోత్సవాలు జరిగిన అన్ని రోజులు గుడిలో ఉన్న స్వామిని లక్ష మంది దర్శించుకుంటే… వెలుపల తీరువీదుల్లో ఊరేగి ఉత్సవ మూర్తులను నిత్యం రెండు నుండి మూడు లక్షల మంది దర్శించుకుంటారు. అదే బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ జరుగుతుంది. ఆ రోజు ఒకరోజే రాత్రి 3నుండి 4 లక్షల మంది దర్శిస్తారు. ఎందకు అంటే భగవంతునికి… భక్తులకు ఇష్టమైన ఉత్సవం గరుడోత్సవం. మరి అలాంటి గరుడోత్సవంలో ఊరేగుతున్న తిరుమలేశున్ని చూడ్డానికి ఏ భక్తుడు ఎందుకు ఇష్టపడదు. అందుకే ఆ ఒక్కరోజే అంత మంది భక్తులు స్వామిని దర్శించి కర్పూర హారతులతో నీరాజనాలు పలుకుతారు. టీటీడీ సైతం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది స్థానిక పోలీసులు సైతం ఏ అవాంచనీయ ఘటనలు జరక్కుండా 3 వేల మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తారు.ఇంత మంది భక్తులు వస్తున్న …వీళ్ళకి నిత్యం సేవలు చేయడానికి ఓ పెద్ద వ్యవస్థే తిరుమలలో ఉంది. అదే టీటీడీ అధికార వ్యవస్థ. టీటీడీ ధార్మిక సంస్థే అయినా,… పరిపాలనా వ్యవహారాలు అన్నీ ప్రభుత్వ ఆదేశాలతోనూ, పర్వవేక్షణతోనూ జరుగుతుంటాయి. అందుకే ప్రభుత్వం తరపున ఓ కార్యనిర్వహణాదికారిని నియమిస్తారు. ఆయనకి సపోర్టుగా ఇద్దరు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్ లను ప్రభుత్వం నియమిస్తుంది. వీళ్ళు మాత్రమే కాకుండా టీటీడీ దేవస్థానంలో ఇప్పటి వరకు 7 వేల మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు గా మరో 20 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. చిన్న స్థాయి ఉద్యుగుల నుండి పైన చెప్పబడిన కార్యనిర్వహణాధికారి వరకు చేయాల్చిన పని ఒక్కటే. సామాన్య భక్తులకు నిత్య సేవలు చేయడం. అంటే భగవంతుని దగ్గరకు భక్తున్ని తీసుకుపోవడం. కానీ ఇవి ఇప్పుడు తిరుమలలో కరువైనాయి. రోజురోజుకీ తిరుమలలో అవినీతి అక్రమాలు పెరుగు పోతున్నాయి. టికెట్ల కుంభకోణాలు, లడ్డుల కుంభకోణాలు, గదులు కాటేజీల కుంభకోణాలు… అవి చాలనన్నట్టు స్థానికంగా ఉండే హోటళ్ళ నిర్వాహకుల ఆగడాలు. ఏ రకంగా చూసినా భక్తులను మోసగిస్తూ జీవిస్తున్నవారి సంఖ్యే ఎక్కువౌతున్నది తిరుమల కొండపై. వీటిని నియంత్రించాల్చిన అదికారులు ఏ మాత్రం పట్టించు కోకవడం లేదు. పైన చెప్పినట్టు దర్శనం టికెట్లు, బ్లాక్ లో లడ్డులు అమ్మడం, గదులు కాటేజీలు బ్లాక్ లో అమ్మడం వంటివి సాదారణంగా నే మనం చూస్తున్నాం. కానీ ఓ మాఫీయాగా తయారై వేలాది మంది భక్తులను మోసం చేసి కోట్లు కుమ్మరించుకున్న హోటళ్ళ యజమానుల ఆగడాలను ఈ మద్యన కంట్రోల్ లోకి తెచ్చిన టీటీడీ ఇన్నాళ్ళు ఏందుకు చేయలేకపోయింది.అస్సలు ఈ హోటళ్ళ నిర్వాహకులు ఎంత మొత్తంలో దోచుకునే వారు. అంత పెద్ద మొత్తంలో దొచుకో వడానికి కారణాలు.. ఏంటి. టీటీడీ టెండర్లు ఏ విదంగా ఉంటాయి. ఎన్ని లక్షల డబ్బు చెల్లించి ఏ హోటళ్ టెండర్ నిర్వాహకులు దక్కించుకుంటున్నారు. ఎవరెవరు ఈ టెండర్లు పాడుకుంటారు. ఆనిభంధలు ఏంటి. నెలనెలా అద్దె ఎంత చెల్లించాలి. ఓ సాదారణమైన హోటల్ళకు టెండర్లలో అంత పోటీ ఉంటుందా. పోటీ ఉంటే ఏ రేంజ్ లో ఉంటుంది. అనే అంశాలు ఒకసారి పరిశీలిస్తే. ఇప్పటి వరకు తిరుమలలో చాలానే ఎక్కడ బడితే అక్కడ మినీ హోటళ్ళు ఉన్నాయి. అవి కాకుండా పెద్ద హోటళ్ళుగా చలామణీ అయినవి ఉన్నాయి. వీటి టెండర్ల ప్రక్రియ చూస్తే అందరూ షాక్ కు గురౌతారు. ముఖ్యంగా మధు సూదన్ నాయుడు అనే వ్యక్తి శ్రీవారి ఆలయానికి వెనుక ప్రాంతంలో 53లక్షల 88వేలా 666 రూపాయలు నెల అద్దెతో…. ఉడ్ సైడ్ పేరుతో ఓ హోటళ్ ను టీటీడీ టెండర్ లో దక్కించు కున్నాడు. అంటే రోజుకి దాదాపు 18 లక్షలు అద్దె అన్న మాట. అవును ఇది వాస్థవం. రోజుకు ఈ నిర్వహకుడు టీటీడీకి 18 లక్షల అద్దెను కట్టాలి అంటే…. ఆ హోటళ్ ఎంత వరకు నిత్యం వ్యాపారం జరగాలి. ఇక దాదాపు ఈ హోటళ్ లో ఒక 150 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి జీత బత్యాలు చిల్లించాలి. ఇక ఆహర పదార్థాలు తయారు చేయడానికి. ముడి సరుకులు కొనుగోలు, వాటి ఖర్చులు చూస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకో 25 లక్షల వరకు నిత్యం క్షర్చు పెట్టాలి. అంటే రోజులో దాదాపు 60 నుండి 70 లక్షలు హోటళ్ళ నుండి ఆహార పదార్థాలు అమ్మితే తప్ప ఇంత మొత్తంలో ఆదాయం రాదు. అలా అంత పెద్ద మొత్తంలో ఆదాయం రావాలంటే ఒక ప్లేటు బోజనం టీటీడీ చెప్పటిన విదంగా 22 రూపాయలకు, ఇడ్లీ ఒకటి రెండు రూపాయలకు అమ్మితే ఎలా సాధ్యం. అందుకే ఇన్నాళ్ళు ఈ హోటళ్ నిర్వాహకులు అన్నం పెట్టి భక్తులకు పంగనామాలు పెట్టారు. ఒక్కో బోజనం 300 రుపాయల నుండి 400 వందలు వసూలు చేశారు. ఒక్కో ఇడ్లీని 25 రూపాయలు అమ్మారు. ఇక జీయస్ టీ అని దొంగ బిళ్ళులు పెట్టి భక్తుల నుండి అందినంతా గుంజారు. మామూళ్ళ మత్తులో టీటీడీ అదికారులు జోగుతున్నడం, టీటీడీ విజిలెన్స్ అదికారులు, స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో వీరి ఆటలకు హద్దే లేకుండా పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com