Home > Politics > 15న జీవో 39కు వ్యతిరేకంగా ధర్నా

15న జీవో 39కు వ్యతిరేకంగా ధర్నా

ఆడపిల్ల పుడితే సరస్వతి పుట్టిందనుకోవాలి : ఎంపీ కవిత
రైతు సమన్వయ సమితి ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం : మంత్రి కేటీఆర్

kodandaram-apduniaరైతు సమన్వయ సమితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు అఖిలపక్ష నేతలు. జీవో 39ని రద్దు చేయాలని కోరారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ నేతృత్వంలో అన్ని పార్టీల నేతలు గవర్నర్ ను కలిశారు. చట్టబద్ధంగా ఉన్న వ్యవస్థలకు సమాంతరంగా మరో వ్యవస్థను సృష్టించడాన్ని అడ్డుకోవాలని కోరారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, న్యూడెమోక్రసీ, జేఏసీ నేతలు ఉమ్మడిగా గవర్నర్‌ను కలిసి జీవో 39 వల్ల జరిగే నష్టాలను వివరించారు. ఈ నెల 15న హైదరాబాద్ లోని వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని కోదండరామ్ తెలిపారు. అలాగే ఈ అంశంపై సదస్సు కూడా నిర్వహిస్తామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల ప్రయోజనం కోసమే ఈ సమితులు ఏర్పాటు చేస్తున్నారని, ఇది ప్రజా ప్రతినిధుల హక్కులను హరించేదిగా ఉందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క విమర్శించారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కల్పించిన హక్కులకు, రైతు సమితులు ఏర్పాటు విరుద్ధమని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు అన్నారు. గ్రామాల్లో నిరంకుశ పాలనను నిర్మించేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు నిరసనగా అక్టోబర్‌ 2న గాంధీ జయంతి రోజున గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆచార్య కోదండరామ్‌ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *