Home > Health > ఘనంగా కొనసాగుతున్న డయేరియా పక్షోత్సవాలు

ఘనంగా కొనసాగుతున్న డయేరియా పక్షోత్సవాలు

ఒక పిల్ వేసుకుంటే తిరిగి య‌వ్వ‌నంలోకి!
గురకకు గుడ్‌బై చెప్పండి ఇలా..

 diarre_apduniaనీళ్ల విరేచనా లను అదుపు చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జూలై 1 నుంచి 15 వరకు డయేరియా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్నెళ్ల లోపు చిన్నారులకు వచ్చే నీళ్ల విరేచనాలను నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా చిన్నారులకు ఓఆర్‌ఎస్, జింక్ ఔషధాలను పంపిణీ చేయనుంది. జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానతో పాటు, 151 సబ్ సెంటర్లు, 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 0-6 ఏళ్ల వయస్సు లోపు చిన్నారులకు మందులు పంపిణీ చేస్తారు. గ్రామ స్థాయిలో ఆశ, ఏఎన్‌ఎం, ఆంగన్ వాడీ వర్కర్ల స మన్వయంతో ప్రతి చిన్నారిని గుర్తించి వారికి ఓఆ ర్‌ఎస్, జింక్ మాత్రలు మింగిస్తారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వర్షపు నీరు భూ మిలో ఇంకి కొత్త నీరు బావుల్లోకి, చెరువుల, బోర్ల లోకి వస్తా యి. కొత్త నీరు ప్రభావంతో చిన్నారులు డయేరి యా బారిన పడతారు.శరీరంలో ఉన్న ఎల క్ట్రోలైట్స్ నీళ్ల వీరేచనాల రూపంలో బైటకు వెళ్లడంతో చిన్నా రులు పూర్తిగా నీరసిస్తారు. అదే సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరిగితే వారు మరింత నీరసించే అవకా శముంటుంది. ఆ సమయంలో ఓఆర్‌ఎస్ ద్రావణం తాగించడం ద్వారా నీళ్ల విరేచనాలకు గురై న చిన్నా రుల్లో 75 శాతం నీరసం తగ్గుతుంది. కాచి చల్లా ర్చిన లీటర్ నీటిలో ఒక్క ఓఆర్‌ఎస్ పాకెట్ కలిపి డయేరియా బారిన పడిన చిన్నారుల కు కొద్దికొద్దిగా తాగించాలి. ఒక్కసారి కలిపిన ద్రా వణాన్ని 24 గంటల వరకు మాత్రమే వినియోగిం చాలి. నీళ్ల విరేచనాలు మొదలైన వెంటనే ఓఆర్‌ఎస్ తాగిం చాలి. ఓఆర్‌ఎస్ ద్రావణంతోపాటు చిన్నా రులకు జింక్ మాత్రలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జింక్ మాత్రల మూలంగా చిన్నారుల్లో నీరసంతో పాటు నీళ్ల విరేచనాలు 
తగ్గుతాయి. విరేచనాలు తగ్గి పోయినా, ఓఆర్‌ఎస్ ఇవ్వడం ఆపేసినా గానీ, తప్ప కుండా జింక్ మాత్రలు 14 రోజుల వరకు ఇస్తూనే ఉండాలి.
జింక్ వల్ల లాభాలు…
తరచూ జబ్బు పడకుండా కాపాడుతుంది.త్వరితగతిన నయం చేస్తుంది.నీళ్ల విరేచనాలు తగ్గాక టానిక్‌లా పనిచేస్తుంది.14 రోజుల వరకు ఎందుకు ఇవ్వాలంటే…కొన్ని నెలల వరకు మళ్లీ విరోచనాలు, న్యూమోనియా రాకుండా కాపాడుతుంది.శరీరంలో జింక్ అవసరాన్ని తీరుస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ఆకలి, బరువు పెంచుతుంది.ఆర్నెళ్లు దాటిన చిన్నారులకు ఒక మాత్ర శు భ్ర మైన నీటితో గానీ, తల్లి పాలతో గానీ కలిపి ఇవ్వాలి.
విరేచనాల సమయంలోవిరేచనాలు ప్రారంభమైన వెంటనే ఓఆర్‌ఎస్ ద్రావణం, జింక్ మాత్ర ఇవ్వాలి.ఎల్లప్పుడు సబ్బుతో చేతులు కడుక్కుంటూ ఉండాలి.చిన్నారులకు 6 నెలలు వచ్చేదాకా తల్లి పాలే తాగించాలి. విరేచనాలు అవుతున్నా తల్లిపాలే తాగించాలి.ఆహారం, పానీయాలు మానకుండా మోతాదు పెంచుతూ ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *