Home > Politics > మార్చి 31 లోగా ఈ ఆఫీస్

మార్చి 31 లోగా ఈ ఆఫీస్

నర్సరీ పెంపకందారులను రైతులుగా గుర్తించాలి: పవన్ కళ్యాణ్
సీరియస్ గా ఉండాలంటూ బాబు వార్నింగ్

dinesh-kumar-apduniaమార్చి 31లోగా రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రభు త్వ కార్యాలయాలను ఇ-ఆఫీస్ విధానం కిందకు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ వెల్లడించారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు జె సత్యనారాయణతో కలిసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్‌ఏపీతో ఇ-ఆఫీస్, ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరు అమలుకు సంబంధించి ప్రాథమిక సమావేశం నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా వచ్చే మార్చి 31లోగా రాష్టస్థ్రాయి నుండి గ్రామస్థాయి వరకూ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పేపర్ లెస్ కార్యాలయాలుగా తీర్చిదిద్దుతామన్నారు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల సత్వర పరిష్కారానికి అవకాశం కలగడమేగాక ప్రభుత్వ ఉద్యోగులకు పనిభారాన్ని తగ్గించేందుకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాలనను మెరుగుపర్చి మరింత సమర్ధవంతంగా, పారదర్శకంగా ప్రజలకు సేవలందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఇ-ఆఫీస్ విధానంతో ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందింపచేసేందుకు తోడ్పడుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర సచివాలయంతోపాటు రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలు, కొన్ని జిల్లాల్లో జిల్లా కార్యాలయాలను ఇ-ఆఫీసు కిందకు తీసుకురావడమే గాక, బయోమెట్రిక్ విధానాన్ని కూడా అమల్లోకి తెచ్చామని అన్నారు. మిగతా అన్ని కార్యాలయాలు పూర్తిగా ఇ-ఆఫీస్ పరిధిలోకి తెచ్చేందుకు, ఆధార్ అనుసంధానిత ఎలబుల్డ్ బయోమెట్రిక్ హాజరు విధానం కిందకు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ చెప్పారు.

అన్ని శాఖల్లో పనిచేసే ఉద్యోగులను వారికి సంబంధించిన వివరాలను హ్యూమన్ రిసోర్సు మేనేజిమెంట్ సిస్టమ్ కింద ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుందని దినేష్‌కుమార్ చెప్పారు. అందువల్ల మార్చి 31లోగా ఇ-ఆఫీస్ విధానాన్ని పూర్తిగా అమలులోకి తెచ్చేందుకు వీలుగా అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్లను ఏర్పాటు చేసుకునేందుకు అన్ని శాఖ లు ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు జె సత్యనారాయణ మాట్లాడుతూ ఈ విధానం అమలుకు సంబంధించిన వారంలోగా మరో సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇ-ఆఫీస్ విధానం అమలులోకి తీసుకురావడంతో పాటు బయోమెట్రిక్ హాజరు విధానాలను ఇ-నిధితో ఇంటిగ్రేట్ చేయడం వల్ల ప్రభుత్వ పాలనను మరింత మెరుగైన రీతిలో ప్రజలకు అందించేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 86 శాఖాధిపతుల కార్యాలయాలున్నాయని, ప్రభుత్వానికి సంబంధించి మొత్తం 214 సేవలను ప్రజలకు అందించడం జరుగుతోందని తెలిపారు. ప్రతి శాఖకు కోడింగ్ ఇచ్చే ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తిచేస్తామని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా గ్రామస్థాయి వరకూ లక్షా 20వేల కార్యాలయాలు ఉన్నాయని, ప్రతి కార్యాలయానికి ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ప్రతి ఉద్యోగికి ఒక కోడ్ ఇస్తారని, దానిలో ఉద్యోగి పేరు, హోదా తదితర వివరాలన్నీ పొందుపర్చి ఉంటాయని వివరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *