Home > World News > పాకిస్తాన్, చైనాలపై డ్రోన్ల నిఘా

పాకిస్తాన్, చైనాలపై డ్రోన్ల నిఘా

తీవ్రవాద సంస్థలతో బంధం తెంచుకోండి
ట్రంప్ కు అపురూప కానుక ఇచ్చిన మోడీ

drone_apduniaభారత సైన్యం  దగ్గర ఇప్పటికే 200 వరకు మానవరహిత డ్రోన్లు ఉన్నాయి. వీటిని ఇజ్రాయిల్ నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఇవి కాకుండా అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు కూడా భారత్ ఒప్పందం చేసుకుంది. రూ.12 వేల కోట్లతో 22 డ్రోన్లను కొనాల్సిన అవసరం ఏముంది? వీటి గొప్పదనం ఏంటి? అనే ప్రశ్న మదిలో మెలగవచ్చు. అయితే ఈ డ్రోన్ల కొనుగోలు అంశం గతేడాది బయటకు వచ్చిన దగ్గర నుంచి చైనా, పాకిస్థాన్‌లు ఎక్కడలేని భయంతో వణికిపోతున్నాయి. ప్రత్యేకించి చైనా ఎందుకు దీనిపై అంతగా మండిపడుతుందో తెలియాలంటే వీటి సామర్థ్యాన్ని తెలుసుకోవాల్సిందే.ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లు కూడా నిఘాకు ఉపయోగపడతున్నాయి. కానీ వీటితో పోలిస్తే అమెరికా ప్రిడేటర్ల సామర్థ్యం చాలా ఎక్కువ. ఇవి 50 వేల అడుగల ఎత్తులో 34 గంటలపాటు గగనతలంలో నిరాంటకంగా ఉండగలవు. శత్రువుల ఉనికి, కదలికలను 1000 కిలోమీటర్ల దూరం వరకు పసిగట్టగలవు. వీటి వేగం కూడా ఎక్కువే. 1700 కిలోల బరువైన పేలుడు పదార్థాలను మోసుకుపోయే సత్తా వీటికుంది. టెక్నాలజీ సాయంతో పనిచేస్తాయి కాబట్టి ఖచ్చితత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.ఇవి వినయోగంలో వస్తే సరిహద్దుల్లో పాక్ చొరబాట్లు, కుట్రలపై నిఘా పెరుగుతుంది. ముఖ్యంగా సర్జికల్ స్ట్రయిక్స్ సమయంలో శత్రు స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలను గుర్తించి ఖచ్చితంగా దాడి చేయవచ్చు. ఇక అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిమ్, లడఖ్ ప్రాంతాల్లో పాకిస్థాన్‌తో కలిసి చైనా సాగించే రహస్య కార్యకలాపాలను ఇట్టే పసిగట్టవచ్చు. ప్రాజెక్టుల పేరుతో హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యాన్ని గండికొట్టడానికి పాక్‌లోని గ్వాదర పోర్టు, శ్రీలంక పోర్టుల్లో అణు జలాంతర్గాములు, యుద్ధ నౌకలను మొహరిస్తోంది. ఇవి మరింత పెరిగితే భారత రక్షణకు ప్రమాదంగా పరిణమిస్తాయి. ఈ చర్యలపై నిఘాకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి.దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యాన్ని పిలిప్పీన్స్, వియత్నాంలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ చైనా ముందుకసాగిపోతుంది. ఈ వివాదం అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. చైనాకు వ్యతిరేకంగా భారత్ కూడా ఈ దేశాలకు సహకరిస్తుంది. తూర్పు తీరంలోనూ జపాన్, దక్షిణ కొరియాలతో చైనాకు సఖ్యత లేదు. హిందూ మహాసముద్రంపై చైనా అరాచకాలు పెరిగేకొద్దీ, దక్షిణ చైనా సముద్రంలో భారత్ ఎదురుదాడి చేస్తుంది. అందుకు ప్రిడేటర్ డ్రోన్లు చాలా ఉపయోగపడతాయి. గత శుక్రవారం ప్రయోగించిన కార్బోశాట్-2 ఉపగ్రహాన్ని కూడా సైన్యం కోసం వినియోగించనున్నారు. దీంతోపాటు మరో 12 ఉపగ్రహాలు ఇప్పటికే సైన్యం వినియోగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com