Home > Bhakti > దుర్గమ్మ గుడిలో నకిలీ నియమకాలు

దుర్గమ్మ గుడిలో నకిలీ నియమకాలు

జనవరి 31 నుంచి సమ్మక్క-సారక్క జాతర
9 నుంచి 11 పున్నమి ఓర్వకల్లు ఫెస్టివల్
 
durgamma_apduniaముగ్గురమ్మల మూలపుటమ్మ, భక్తులు కష్టాలు తీర్చేకనకదుర్గమ్మ ఆంధ్రప్రదశ్కే తలమానికం. కోట్లాది రూపాయల ఆదాయం. ఆ ఆదాయంతోనే అభివృధ్ధి పనులు, కాంట్రాక్టర్లనుండి కమీషన్లు దండుకునే అధికారులు, ఇది అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ, దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు, ఇక్కడ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవ్యక్తులే లేని ఉద్యోగాలు సృఫ్టించి విజయవాడలోని గాంధీనగర్ లోనిఒక డిటిపి కేంద్రంగా నకిలీ ఐడి కార్డులు, నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా తయారు చేసి, అవినీతి దందా  కొనసాగిస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు, తమ కష్టాలు తీరాలని అమ్మ వారికి మొక్కులు చెల్లించి హుండీలు నింపుతుంటే ,  ఈ అధికారుల తీరు మాత్రం గుడిని గుళ్ళో లింగాన్ని మింగేసే విధంగా వుందని  విమర్శలు వచ్చిపడుతున్నాయి. చిన్న ఉద్యోగులేమి కాదు, నెలకు లక్షలాది 
రూపాయల అమ్మవారి జీతం,  ఇదంతా దుర్గమ్మకు తెలీదా అంటే, పాపం పండేదాకా అమ్మ కూడా వేచి చూచింది. చివరకు, పోలీసుల సహకారంతో శరాఘాతం విసిరేందుకు రంగం సిద్ధం చేసుకుంది.  కోనేరు సందీప్ అనే వ్యక్తి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా దుర్గ గుడి పై ప్రైవేటు ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి క్లాస్ మేట్ అయిన వరప్రసాద్ తో పరిచయం అయింది. తాను టెంపరరీగా ఉద్యోగం చేస్తున్నా నని, పర్మినెంటు చేయించాలని వరప్రసాద్ కు చెప్పాడు. అయితే వరప్రసాద్ దుర్గగుడిలో బస్ డ్రైవర్ గా పనిచేస్తున్న వీరాస్వామికి పరిచయం చేసాడు. సందీప్ వీరాస్వామిల మధ్య పరిచయం పెరిగింది. రెండు లక్షల రూపాయలు చెల్లిస్తే, ఉద్యోగం పర్మినెంటు చేయిస్తానని, తనకు దర్గగుడిలో పనిచేసే డిఇ బాగా పరిచయస్ధుడని, అతని సహాయంతో చేయించి పెడతానని నమ్మించాడు. దాని నిమిత్తం, రెండు లక్షల రూపాయలు డిశెంబరు 2015లో వీరాస్వామికి ముట్టచెప్పాడు. డిఇ  పాటుగా అప్పట్లో ఉన్న ఇఓ, సిసి కూడా ఇతనిని పర్మినెంటు చేసేందుకు ఇంటర్వ్యూ నిర్వహించారు. అయితే అక్కడే పనిచేస్తున్న వరప్రసాద్ 
కూడా వీరికి సహాయం చేసాడు. ఇంటర్వ్యూ అయిన అనంతరం రెండు నెలలకు, ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, దర్గగుడి ఉద్యోగిగా ఆధార్ కార్డు, అపాయింట్ మెంట్ లెటరు కూడా ఇచ్చారు. ఎలక్ట్రికల్ డిపార్టుమెంటులో ఉద్యోగిగా జాయినింగ్ రిపోర్టు ఇచ్చేందుకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. ఏమి చేయాలో పాలుపోక, తనకు జరిగిన మోసాన్ని గ్రహించి, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆశ్చరక్యకరమయిన విషయాలు బయటపడ్డాయి. గతంలో కూడా చైతన్య అనే వ్యక్తి మోసపోయినట్లు తెలుసుకుని ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారు. ఒక్కసారిగా నకిలీ ఉద్యోగాల భాగోతం గుట్టు రట్టవడంతో పోలీసులు వీరాస్వామిని, వరప్రసాద్ ను అరెస్టు చేసి, వారిచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా డిఇ కోటేశ్వరరావు పైన అప్పటి ఇఓ నరసింగరావు పైన కూడా 
కేసులు నమోదు చేసారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే ఎంతటి అధికారి అయినా, అతనిని అరెస్టు చేసేందుకు కూడా రంగం సిధ్ధం చేస్తున్నారు. ఎవిడెన్సు యాక్టు ప్రకారం, ఫిర్యాదు దారుడు, అరెస్టు అయిన నిందితుడు ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం నకిలీ ఉద్యోగాల విషయంలో డిఇ కోటేశ్వరరావు, ఇఓ నరసింగరావు పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్దారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా, మరియ ప్రస్తతం డిఇ గా పనిచేస్తున్న భాస్కరరావు వద్ద కూడా స్టేట్ మెంట్ తీసుకున్నారు. దొంగ ఆర్డరు ఇచ్చినప్పుడు ఉన్నతాధికారుల వద్దకు ఎందుకు తీసుకువెళ్ళలేదన్న ప్రశ్నకు డిఇ భాస్కరరావు నోరు మెదపలేదు. ప్రస్తుతం ఉన్న ఇఓ ఈ విషయంలో  ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదో అన్నదానిపై కూడా దృష్టి సారించారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *