Home > World News > మెక్సికోలో భారీ భూకంపం

మెక్సికోలో భారీ భూకంపం

ఉక్కు మహిళకు నాలుగోసారి పట్టం
కొరకరాని కొయ్యగా కిమ్ జాంగ్

mexico-మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. భూకంప ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 156కు చేరిందని అధికారులు తెలిపారు. . కూలిన భవనాల కింద కొంత మంది చిక్కుకున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మెక్సికోకు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భరోసా ఇచ్చారు. 1985, సెప్టెంబర్ 19న సంభవించిన భూకంపంలో 10వేల మంది మృతి చెందిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా బిలియన్ల కొద్దీ ఆస్తి నష్టం సంభవించిందని, మొత్తం ఆస్తినష్టం అంచనాలు అందేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. వేలాది భవనాలకు బీటలు పడ్డాయి. మెక్సికో నుంచి వస్తున్న వీడియోలు, చిత్రాలు భూకంప తీవ్రతను తెలియజేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com