Home > Editorial > తెలుగు రాష్ట్రాల్లో భూ కంపం

తెలుగు రాష్ట్రాల్లో భూ కంపం

ఐటీడీఏ పాలనలతో కొరవడతున్న ట్రాన్స్ పరెన్సీ
ఫసల్‌ బీమా పథకం భరోసా

KCR-Naidu_apduniaఅటు హైద్రాబాద్, ఇటు విశాఖపట్నం… తెలుగు రాష్ట్రాల్లో భూకంపనాలు సృష్టిస్తున్నాయి.. తెలంగాణలోని దండుమైలారంలోని హఫీజ్‌పూర్‌ భూముల వ్యవహారం , ఇటు వైజాగ్ లోని భూముల వ్యవహారం ఇద్దరు చంద్రులకు తలనొప్పిగా మారాయి. దీంతో ఈ స్థలాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు… తమ స్థాయి మరిచి… రోడ్డున పడుతున్నారు. మొదట్లో ఈవిషయంలో టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు యూటర్న్‌ తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో కేశవరావు కుటుంబసభ్యులు ప్రభుత్వ జంగ్లాత్‌ (అటవీ) భూములను రిజిస్టర్‌ చేసుకున్న వ్యవహారంపై వెనక్కి తగ్గారు వివాదాస్పద గోల్డ్‌స్టోన్‌ సంస్థ నుంచి వీటిని కొనుగోలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తొలుత ఈ భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేస్తే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చె ప్పిన కేకే.. ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు.ఈ భూములు సక్రమమో, అక్రమమో గానీ, వివాదంలో ఉన్న భూములు కొని తాను నష్టపోయానని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మురికిడీల్‌ కోసం తాను తమ ప్రభుత్వంతోను, తమ నాయకుడితోను పోరాడలేనని చెప్పారు. ఈ మురికి డీల్‌ వదులుకోవాలని తమ కుటుంబ సభ్యులమంతా కలిసి నిర్ణయించామని చెప్పారు. ఈ భూముల సేల్‌ డీడ్‌ను రద్దు చేయాలని తానే కోర్టును కోరతానన్నారు. వివాదాస్పద భూములను అమ్మిన విల్టేజ్‌ గ్లోబల్‌మీడియా సంస్థకు లీగల్‌ నోటీసు పంపించి తనకు జరిగిన నష్టపరిహారాన్ని వడ్డీతో సహా రాబడతానన్నారు. అటు విశాఖపట్నంలో అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య వివాదంగా మారింది ఒకప్పుడు ప్రాణ స్నేహితులైన… వీరు ఇప్పుడు బద్ధ శత్రువులు. జిల్లాకు మంత్రులు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. కానీ వీరి చేష్టలు మాత్రం బాధ్యతా రాహిత్యంగా కనిపిస్తున్నాయి. విశాఖలో వేల కోట్ల రూపాయల భూ కుంభకోణంపై మీడియాలో నిరంతరం వస్తున్న వార్తా కథనాలతో విశాఖ పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది. ప్రభుత్వం ప్రతిష్ట మంట కలిసింది. పార్టీ ఇమేజ్ బజారున పడింది. జిల్లా మంత్రులు రోడ్డెక్కి ఒకరిపై మరొకరు వేలెత్తి చూపుకొంటున్నారు. మిత్రపక్షంలో ఉన్న బిజెపి శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు కూడా కుంభకోణంలో అనేక కోణాలను వెలుగులోకి తెచ్చి, ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. విశాఖ జిల్లాలో ల్యాండ్ స్కామ్ వీరి మధ్య అంతర్లీనంగా ఉన్న శత్రుత్వాన్ని మరోసారి బయటపెట్టింది. విశాఖ ప్రజలు అమాయకులని ముఖ్యమంత్రి చెపుతుంటే, అది నిజమని జనం నమ్ముతున్నారు. కానీ ఈ ఇద్దరు మంత్రుల వైఖరితో అమాయక ప్రజలు కూడా విసుగుచెందారంటే అతిశయోక్తి కాదు. విశాఖలో 20 వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణం జరిగిందని సాక్షాత్తూ జిల్లా కలెక్టరే చెప్పారు. ఇదే సమయంలో బాధ్యతగల మంత్రులు జోక్యం చేసుకుని స్కామ్‌ల గురించి ఆరా తీయలేదు. మంత్రి అయ్యన్న పాత్రుడు కుంభకోణంలోని కొన్ని వాస్తవాలను మీడియా ముందుంచారు. అప్పటి నుంచి కుంభకోణాల ధారావాహిక కొనసాగుతునే ఉంది. విశాఖలో జరుగుతున్న ల్యాండ్ స్కామ్ గురించి అయ్యన్న నేరుగా సిఎం దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేకపోయారు? ఆయనకు సిఎం అపాయింట్‌మెంట్ దొరకకపోతే, విధిలేని పరిస్థితుల్లో మీడియా ముందు చెప్పారనుకోవచ్చు. నిత్యం సిఎంను కలిసే అయ్యన్న విశాఖలో జరుగుతున్న దారుణాలను ఆయనకు వివరించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇక గంటా విషయానికి వస్తే, విశాఖలో భూముల కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతున్నా, ఆయన పెదవి విప్పలేదు. అందులో ఆయన బంధువుల హస్తం ఉందని పత్రికలు ఘోషిస్తున్నా, ఈజీగా తీసుకున్నారు. మీడియా ఎదురుపడితే, దోషులను శిక్షిస్తామని చెప్పి తప్పించుకున్నారు. ఆయన కూడా ప్రభుత్వంలో ఒక బాధ్యతాయతమైన మంత్రి. పైగా జరిగిన స్కాముల్లో ఆయన నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి. కొద్ది రోజుల కిందట ఆయన కలెక్టర్‌తో సమావేశమైన తరువాతైనా, స్కాముల వివరాలు తెలుసుకుని సిఎం దృష్టికి గంటా ఎందుకు తీసుకువెళ్లలేకపోయారు? ఆయన కూడా సిఎంను నిత్యం కలుస్తునే ఉంటారు కదా? అయ్యన్న చేసిన, చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్నపళంగా లేఖ రాయాల్సిన అగత్యం గంటాకు ఎందుకు వచ్చింది? అది కూడా తొమ్మిదో తేదీన రాసిన లేఖ 14న ఎందుకు వెలుగులోకి వచ్చింది? కేవలం మీడియాను కాసేపు తప్పు తోవ పట్టించేందుకే ఈ లేఖాస్త్రాన్ని ప్రయోగించారన్న విమర్శలు గంటా ఎదుర్కోక తప్పదు. విశాఖ ల్యాండ్ స్కామ్‌పై విచారణకు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. అది ఎందుకూ పనికిరాదని ఆపాటి, ఈపాటి లా పాయింట్‌లు తెలిసినవారందరికీ అర్థమవుతోంది. ఇప్పుడు మంత్రి గంటా రాసిన లేఖలో ఈ భూ కుంభకోణంపై సిఐడి, లేదా సిబిఐతో విచారణ జరిపించాలని కోరడాన్ని చూస్తే, సిట్‌పై ఆయనకు కూడా నమ్మకం లేనట్టే కదా? ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐడి, సిబిఐ విచారణకు నియమించే అవకాశం లేదు. అటువంటప్పుడు సిఎంకు గంటా రాసిన లేఖలో విలువేముంటుంది? వుడాలో 500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినప్పుడు గంటా శ్రీనివాసరావు చలించిపోయి, విశాఖ పరువు కాపాడే విధంగా వుడాను దారిలోకి తెస్తామని అన్నారు. మరి 20 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి మాఫియా తెగబడితే, మంత్రులు ఇద్దరూ అధికారులను దగ్గర కూర్చోబెట్టుకుని బాధితులకు న్యాయం జరిగేలా ఎందుకు చూడలేకపోయారు. బాధితులను గాలికొదిలేసి, తమ విభేదాలను మరోసారి తెర మీదకు తెచ్చి, కుంభకోణాన్ని నిలువునా భూస్థాపితం చేసే ప్రయత్నమే ఈ పొలిటికల్ వార్‌కి తెర లేచిందన్నది నిజం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *