Home > General > కొండెక్కిన గుడ్డు

కొండెక్కిన గుడ్డు

ట్రాఫిక్ చట్రంలో విజయనగరం
నెల్లూరు డాక్టర్లు మారరా.....

egg-apduniaఒక వైపు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు.. మరోవైపు కూరగాయల ధరలకు తోడు తాజాగా కోడి గుడ్డు సైతం నేనేమీ తక్కువ కాదంటూ ఆకాశానికెక్కింది. బహిరంగ మార్కెట్లో కోడిగుడ్డు ధర ఒక్కసారిగా 7రూపాయలకు చేరింది. పెరిగిన ధరతో పౌల్ట్రీ రైతు ఆనంద పడుతుంటే… వినియోగదారులు మాత్రం గుడ్లు తేలేస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు సైతం కోడిగుడ్లను ఎగుమతి చేసే పశ్చిమగోదావరి జిల్లాలో కోడిగుడ్డు సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. నిన్నటిదాకా బహిరంగ మార్కెట్లో రు.4.50 పైసలు పలికిన కోడిగుడ్డు… ఇప్పుడు పౌల్ట్రీ వద్దే రు.4.50 పైసలకు చేరింది. ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్డు ధర గత మూడేళ్ళుగా నష్టాల్లో ఉన్న పౌల్ట్రీ రైతుల జీవితాల్లో ఆశలు చిగురించేలా చేసింది. మరోవైపు వినియోగదారులకు మాత్రం పెరిగిన ధర పెనుభారమైంది. హోల్ సేల్ మార్కెట్లోనే రు.5.50 పైసలు పలుకుతున్న గుడ్డు బహిరంగ మార్కెట్లో ఆరు నుంచి ఏడు రూపాయలకు చేరడంతో సామాన్య, పేద ప్రజలు తమకు పౌష్టికాహారం అందని ద్రాక్షేనంటున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ చరిత్రలోనే రికార్డు స్థాయి ధర పలికిన కోడిగుడ్డు ధర ఈ పరిశ్రమకు ఆశాజనకంగా మారింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 800 కోళ్ల ఫారాలు ఉండగా, వీటిలో కోటి 30 లక్షల కోళ్లు ఉన్నాయి. ఈ పరిశ్రమల ద్వారా నిత్యం 150కు పైగా లారీల్లో ఎగుమతులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, పశ్చిమబెంగాల్, అస్సోం రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున ఎగుమతులు అవుతున్న ఈ జిల్లాల్లో గతంలో వెయ్యి కోళ్ల ఫారాలు ఉండగా, గత మూడేళ్లుగా వచ్చిన నష్టాలతో 200 కోళ్ల ఫారాలు మూతబడ్డాయి. తీవ్ర నష్టాల్లో ఉన్న తరుణంలో పెరిగిన కోడిగుడ్డు ధర పౌల్ట్రీ పరిశ్రమకు ఆసటగా నిలవగా… వినియోగదారుడు మాత్రం కోడిగుడ్ల కొనుగోలుకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *