Home > Politics > జిల్లాల్లో రెండేళ్ల ముందే ఎన్నికల వాతావరణం

జిల్లాల్లో రెండేళ్ల ముందే ఎన్నికల వాతావరణం

మోడీ గురువు కన్నుమూత
గాంధీభవన్‌లో రాహుల్‌గాంధీ పుట్టిన రోజు వేడుకలు

nijamabad_apduniaనిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. వచ్చే రెండేళ్లలో ఎన్నికలు జరగనుండటంతో అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీల నేతలు పార్టీలను బలపరుచుకునే పనిలో పడ్డారు. సీయం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా టిఆర్‌ఎస్ నేతలు ముందుకు పోతుంటే.. ప్రతిపక్ష పార్టీల నేతలు పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీంతో జిల్లాల్లో రాజకీయం వేడెక్కుతోంది. .నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సీఎం కేసీఆర్ నిజామాబాద్ మార్కెట్ కమిటీ మినహా.. ఉభయ జిల్లాల పరిదిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉభయ జిల్లాల పరిధిలో 10 వరకు దేవాదాయ కమిటీలను నియమించారు. దీంతో పార్టీ నేతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. వారంతా గ్రామస్ధాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి సారిస్తున్నారు. అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టిపెట్టారు. పార్లమెంట్ సెగ్మెంట్‌లో రెండు సీట్లు పెరిగే అవకాశం ఉండటంతో రెండు జిల్లాలపై దృష్టి పెట్టారు నేతలు. రెండు జిల్లాల పరిధిలోను కొన్ని నెలలుగా ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం జోరుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతలను, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ధర్నాలు , ఆందోళనలు చేస్తున్నారు.మరోవైపు కాంగ్రెస్, టిడిపి, బిజెపి నేతలు జిల్లాలో మరింత పట్టుకోసం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మధ్యనే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాహుల్ సభను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ నేతలు కీలక పాత్ర పోషించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇంఛార్జ్‌లు కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రైతులు ఇతర వర్గాలతో కలిసి సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఇదే పంథాలో పయనిస్తున్నారు టిడిపి నేతలు.గత నెలలొ బిజెపి జాతీయ అద్యక్షులు అమిత్ షా నల్గొండ జిల్లా పర్యటన తరువాత బిజెపి నేతలలో చలనం వచ్చింది. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పరిధిలో బిజెపి నేతలు ఇంటింటికి బిజెపి కార్యక్రమం చేపట్టారు. గ్రామస్ధాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈనెలలో రెండురోజుల పాటు ఉభయజిల్లాల్లో పర్యటించిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వామపక్ష పార్టీలైన సీపీఎం, సిపిఐలు కూడా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వామపక్షాల నేతలు. ఏది ఏమైనా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈసారి రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు మధ్య పోటీ గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *