Home > Editorial > ఆత్మ విశ్వాసం మితి మీరితే ఇబ్బందులే

ఆత్మ విశ్వాసం మితి మీరితే ఇబ్బందులే

నాలుగేళ్లలో కమలం
కాంగ్రెస్ కు పునర్ వైభవం సాధ్యమేనా

vote-apduniaలోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు సాధ్యమా అన్నది ఇక్కడ ఆలోచించాల్సి ఉంది. 2019 మేలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలను ముందుకు తీసుకు వచ్చి రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతో పాటు జరిపే బదులు, కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుకు తీసుకువెళ్లి 2019 మేలో లోక్‌సభ ఎన్నికలతో పాటు జరపడం మంచిదేమో బీజేపీ నాయకత్వం ఆలోచించాలి.దేశంలో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఈ మధ్య కాలంలో అనేక వార్తలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ముందుగానే లోక్‌సభను రద్దుచేసి ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలు జరిపే అవకాశం ఉందని వదంతులు వ్యాపిం చాయి. ఈ ఏడాది ఆఖరులోనే చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. శాసనసభల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరపాలని మోదీ చాలాకాలంగా కోరుకుంటున్నారు కాబట్టి, ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటే లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పత్రికలు రాస్తున్నాయి. కొన్ని పత్రికలు మరో అడుగు ముందుకు వేసి, మరో వందరోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కూడా రాశాయి. అంటే ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరుగుతాయని అవి చెబుతున్నాయన్నమాట.2014 ఎన్నికల్లో మోదీకి ప్రచారకర్తగా సేవలు అందించిన టెక్నాలజీ నిపుణుడు రాజేశ్ జైన్ తరచూ చేసే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 2014 తర్వాత నుంచి మోదీ నాయకత్వంలోని బీజేపీ సీట్లు క్రమంగా తగ్గుతున్నాయే తప్ప ఏమంత పెరగడం లేదంటూ ఆయన ఈ మధ్య ఓ పత్రికలో కాలమ్ రాశారు. మళ్లీ తన బలాన్ని నిరూపించుకోవాలంటే మోదీకి ముందస్తు ఎన్నికలకు వెళ్ల డం తప్ప మార్గం లేదన్నట్టుగా ఆయన రాశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికే మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సుముఖంగా ఉన్నారని, ఎంత ముం దుగా ఎన్నికలకు వెళతారన్నది చెప్పలేమని బీజేపీ నాయకులు కూడా అడపాదడపా సూచనలు వదులుతున్నారు. మామూలుగా అయితే 2019 మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో మోదీ చేసిన ప్రసంగం ఎన్నికల ప్రచారంలా ఉందన్న సంగతి వారు గుర్తు చేస్తున్నారు.వచ్చే ఏడాది వరకూ మోదీ ఎన్నికలు జరపకుండా ఆగడమంటే, ప్రజాభిమానం మరింత దూరం కావడం తప్ప ప్రయోజనం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత రానురానూ పెరిగిపోతున్న సంగతి బీజేపీ అగ్రనాయకులు కూడా గ్రహించే ఉన్నారు. నిరుద్యోగ సమస్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజ ల కష్టనష్టాలు కూడా పట్టణాల వరకూ వినిపిస్తున్నా యి. మరోపక్క చమురు ధరలు పెరుగుతూ నిత్యావసరాల ధరలను ఆకాశానికి చేరుస్తున్నాయి. ఈ ఏడాది సరిగ్గా వర్షాలు పడలేదంటే మోదీ సమస్యలు పేట్రేగిపోవడం ఖాయం. ఈ కారణాలన్నిటి కంటే, హఠాత్తుగా ఓ నిర్ణయం తీసుకుని ప్రజలను, ప్రతిపక్షాలను దిగ్భ్రాంతుల్ని చేయడం కూడా జరగవచ్చు. అవతలివారిని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడమంటే మోదీకి ఎంతో ఇష్టం. హఠాత్తుగా ముందస్తు ఎన్నికలు ప్రకటిస్తే, ప్రతిపక్షాలకు కూడగట్టుకోవడానికి సమయం ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమర్థంగా ప్రచారం చేయడానికి కూడా పెద్దగా అవకాశం ఉండదు.. గ్రామీణ ఆర్థికరంగం విషయంలో, ముఖ్యంగా చిన్న రైతుల విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. గ్రామీణ ఆర్థికరంగం ఓ సంక్షోభంలో చిక్కుకుని ఉంది. అసలు దేశ ఆర్థిక వ్యవస్థే మందకొడిగా ముందుకు అడుగులు వేస్తోంది. ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం లేదు. ప్రభు త్వం ఒకపక్క బ్యాంకులకు ఆర్థిక సహాయం పెంచు తోంది. రాని బాకీలతో అవస్థలు పడుతున్న బ్యాంకులను ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరో పక్క పెద్దయెుత్తున జాతీయ ఆరోగ్య బీమా పథకాన్ని చేపట్టింది. కానీ, ప్రభుత్వం ఓటర్లను తన వైపునకు తిప్పుకోవడానికి మాత్రం మరెంతో చేయాల్సి ఉంది. బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ)లో లుకలుకలు దేశప్రజలు గమనించకపోలేదు. మిత్రపక్షాలతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా బీజేపీ వ్యతిరేకతను పెంచి పోషిస్తోంది. ముఖ్యంగా శివసేన, తెలుగుదేశం పార్టీలతో వివిధ సందర్భాలలో తలెత్తినవిభేదాలకు అటు నరేంద్ర మోదీ నుంచి గానీ, ఇటు అమిత్ షా నుంచి గానీ సరైన స్పందన వ్యక్తం కాకపోవడం అగ్నికి ఆజ్యా న్ని తోడు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వానికి రాష్ట్ర విభజన సందర్భంగా చేసిన వాగ్దానాల్లో ఒక్క వాగ్దానాన్ని కూడా కేంద్రం సంతృప్తికరంగా పరిష్కరించకపోవడం దేశ రాజకీయాలపై తప్పనిసరిగా ప్రభావం కలగజేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యే కహోదా ఇస్తామని పార్లమెంట్‌లో ప్రకటించిన బీజేపీ చివరికి దాన్ని ప్రత్యేక ప్యాకేజీగా కూడా సక్రమంగా ఇవ్వకపోవడం ఆ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచేదే తప్ప బలం చేకూర్చేదిగా లేదు. ఇక మోదీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా తమకు ఒరిగిందేమీ లేదని మధ్యతరగతి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారంలోకి రాగానే ఆదాయపు పన్ను పరిధిని అయిదు లక్షలకు పెంచుతామని వాగ్దానం చేసిన మోదీ ప్రభుత్వం ఆ తరువాత ఆదాయపు పన్ను పరిధి పెంచే విషయంలో పెద్దగా చేసిందేమీ లేదన్న విమర్శలు మధ్యతరగతి నుంచి వ్యక్తమవుతున్నాయి. మున్ముందు మోదీ ప్రభు త్వ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలే ఉన్నట్టు రాజేశ్ జైన్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ప్రభుత్వానికి కూడా అర్థమై ఉండాలి. గుజరాత్ ఎన్నికల్లో ఆశించినంత మెజారిటీ లభించలేదు. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్ ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ప్రభుత్వం సాఫీ రోడ్డు మీద ప్రయాణిస్తున్నట్టు లేదు. అది శిఖరారోహణ చేస్తున్నట్టుగా ఉంది. నిజానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కూడా సాహసంతో కూడిన పనే. ఇందులో కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. 1999 అక్టోబర్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి మూడవసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. తదుపరి ఎన్నికలు 2004 అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. అయితే, 2003 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ విజయాలు సాధించింది. ఈ విజయాలను చూసి బీజేపీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో 2004 ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించింది. అయితే ఆ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయింది. వాజ్‌పేయి చేసిన పొరపాటునే మోదీ చేస్తారా అన్నది తెలియడం లేదు. అధికారంలో ఉన్న కొద్దీ ప్రతిరోజూ ఏదో విధంగా ఓటర్లకు అపీలు చేసుకుంటూ ఉండవచ్చు. అధికారంలో లేకపోవడమంటే ఓటర్లకు దూరం కావడమే అవుతుంది. అందువల్ల ముందస్తు ఎన్నికలంటే ఓ సదవకాశాన్ని చేజార్చుకున్నట్టే అవుతుంది. తాను దేశంలో బలైమెన శక్తిగా ఉండి, తన హవా కు తిరుగులేదని, తాను తారస్థాయిలో ఉన్నానని భా వించినప్పుడే ఏ అధికార పక్షైమెనా ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అంత ఆత్మవిశ్వాసం ఇప్పుడు బీజేపీలో సాధ్యమా అన్నది పరిశీలించాల్సిన విషయమే. 2002 జూలైలో ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గుజరాత్ శాసనసభను రద్దుచేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. గోద్రా విధ్వంసకాండతో ఓటర్ల పునరేకీకరణ జరిగి ఉంటుందని బీజేపీ భావించడం వల్లే ముందస్తు ఎన్నికలు ప్రకటించడం జరిగింది. జాతీయ స్థాయిలో బీజేపీలో అటువంటి ఆత్మవిశ్వాసం పెంచడానికి జరిగిందేమీ లేదు. 2016లో పాకిస్థాన్ మీద సర్జికల్ దాడులు జరిగినప్పుడు బీజేపీలో అటువంటి ఆత్మవిశ్వాసమే వ్యక్తమైంది. ఇప్పుడు కూడా అటువంటి చర్యేదో తీసుకుంటే తప్ప బీజేపీలో ఆత్మవిశ్వాసం తారస్థాయికి చేరదు. అందువల్ల ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ నాయకత్వం ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. 2019 మేలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలను ముందు కు తీసుకువచ్చి రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతో పాటు జరిపే బదులు, కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుకు తీసుకువెళ్లి 2019 మేలో లోక్‌సభ ఎన్నికలతో పాటు జరపడం మంచిదేమో బీజేపీ నాయకత్వం ఆలోచించాలి. బీజేపీ 19 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. బీజేపీ తలచుకుంటే ఈ రాష్ట్రాలలో శాసనసభలను రద్దు చేసి, ఏదో ఒక సమయంలో ఎన్నికలు నిర్వహించడం కష్టైమెన విషయమేమీ కాదు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జార్ఖండ్, మహారాష్ట్రల శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ రాష్ట్రాలకు కూడా 2019 ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరిపే విషయం కూడా బీజేపీ ఆలోచించాల్సిన అంశమే.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *