Home > Politics > ఏలూరులో ఇంటింటికి తెలుగుదేశం

ఏలూరులో ఇంటింటికి తెలుగుదేశం

తెలంగాణలో కమలానికి, సైకిల్ మధ్య పెరుగుతున్న దూరం
మళ్లీ విమోచన యాత్ర తో కమలం హడావిడి

bujji-telugudesam-apduniaరాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశపెడుతున్న సంక్షేమ ప‌ధ‌కాల‌ను, చేస్తున్న అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాడంతో పాటుగా వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకే రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ఇంటింటికి తెలుగుదేశం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌వేశ‌పెట్టార‌ని ఏలూరు ఎమ్మెల్యే కోట‌ రామారావు (బుజ్జి) తెలిపారు. స్థానిక ఒకటవ డివిజ‌న్ లో సోమవారం ఇంటింటికి తెలుగుదేశం కార్య‌క్ర‌మాన్ని అయన ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఒకటవ డివిజ‌న్ కార్పొరేట‌ర్ కోరాడ దుర్గామ‌ల్లేశ్వ‌ర్ అధ్య‌క్ష‌త వ‌హించ‌గా రాష్ట్ర హ‌స్త‌క‌ళ‌ల అభివృద్ది క‌మిటీ ఛైర్మ‌న్ పాలి ప్ర‌సాద్, ఏలూరు ఎమ్మెల్యే బ‌డేటి కోట‌రామారావు, మేయ‌ర్ షేక్ సూర్ణ‌హాన్లు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అతిధుల‌కు డివిజ‌న్ ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. తొలుత డివిజ‌న్లోని ఎంఆర్సి కాల‌నీలో ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం తెలుగుదేశం పార్టీ జెండాను అవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో డివిజ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను కార్పోరేట‌ర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. త‌మ డివిజ‌న్లో ఇంకా 85 మందికి పెన్ష‌న్లు మంజురు కావాల‌ని, వంద మంచినీటి పైపు క‌న‌క్ష‌న్లు ఇవ్వాల‌ని, వ‌ర్షా కాలంలో డ్రైనేజీల‌లో నీళ్లు నిలిచిపోవ‌డంతో పారిశుద్ధ్యం అధాన్నంగా ఉంటుంద‌ని, ఎంఆర్సి కాల‌నీలోని మైదానంలో మంచినీటి ట్యాంక్ ను నిర్మించాల‌ని కార్పోరేట‌ర్ ఎమ్మెల్యేను కోరారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం విభ‌జ‌న చెంది రూ. 16వేల కోట్లు అర్ధిక లోటులో ఉన్న‌ప్ప‌టికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పేద ప్ర‌జ‌ల సంక్షేమ‌మానికి ఎన్నో అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌వేశపెడుతున్నార‌న్నారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డంతో పాటు వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు సీఎం ఇంటింటికి తెలుగుదేశం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌వేశ‌పెట్టార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎఎంసి ఛైర్మ‌న్ పూజారి నిరంజ‌న్, డిప్యూటీ మేయ‌ర్ నాయుడు పోతురాజు, కోఆప్ష‌న్ స‌భ్యులు ఎస్ఎంఆర్ పెద‌బాబు, కోల్లేప‌ల్లి రాజు, విప్ గూడ‌వ‌ల్లి వాసు, తెలుగు యువ‌తి జిల్లా అధ్య‌క్షులు మాగంటి రాంజీ, నాయకులుఎస్వీ రంగారావు, కోరాడ బాల‌కృష్ణ‌, న‌వీన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *