Home > Sports > మూడో టెస్ట్ కు ప్రయోగాలు

మూడో టెస్ట్ కు ప్రయోగాలు

శ్రీశాంత్ కు కోర్టులో ఊరట
మూడో టెస్ట్ కు జడేజా దూరం

India-Vs-Sri-Lanka-apduniaశ్రీ లంకపై మూడు టెస్టుల సిరీస్‌ని 2-0తో ఇప్పటికే చేజిక్కించుకున్న భారత్ జట్టు శనివారం నుంచి జరగనున్న చివరి టెస్టులో ప్రయోగాలు చేయాలని యోచిస్తోంది. ఆదివారం ముగిసిన కొలంబో టెస్టులో క్రమశిక్షణ తప్పి మూడో టెస్టు నుంచి నిషేధానికి గురైన స్పిన్నర్ రవీంద్ర జడేజా స్థానంలో.. యువ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కి చోటివ్వాలని కెప్టెన్ కోహ్లి భావిస్తున్నాడట.ఆస్ట్రేలియాతో ఈ ఏడాది మార్చిలో ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్.. తన మార్క్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో కంగారు బ్యాట్స్‌మెన్‌‌ని ముప్పుతిప్పలు పెట్టి.. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. లంకపై ఇప్పటికే సిరీస్‌ దక్కిన నేపథ్యంలో చివరి టెస్టులో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ‌కి అవకాశం ఇవ్వడంపై కూడా టీమిండియా చర్చిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *