Home > Politics > పవన్ అన్నా… నీకు నీ జెండాకు సెలవు…

పవన్ అన్నా… నీకు నీ జెండాకు సెలవు…

ప్రజారాజ్యం కన్నా పవన్ కు తక్కవ శాతం ఓట్లు
కర్నూలులోచంద్రబాబుకు గుడి

pawan-kalyan-apduniaజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. పిచ్చోడి చేతిలో రాయి పడ్డట్లుగా ఉంది అతని వ్యవహార శైలి. అసలు ఏం మాట్లాడుతున్నాడో. ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాదు. కాసేపు విహెచ్ ను సి.ఎం చేయమంటాడు. ఇంకాసేపు అసలు రిజర్వేషన్లు, సామాజిక వర్గాలు వద్దంటాడు. అసలు గెలుపు అనేది నా టార్గెట్ కాదంటాడు. ప్రశ్నిస్తానంటాడు. కానీ విపక్షాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఫలితంగా పవన్ కల్యాణ్ మీద ఉన్న ఆశలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. అందుకే ఓ వీరాభిమాని ఆయన కోసం రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ లేఖను యధాతథందా ఇస్తున్నాం…

గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు వారికి మీ అభిమాని వ్రాయునది,
అన్నా నా పేరు వంశీ. మాది పశ్చిమగోదావరి జిల్లా. నేను రోజు పూజ చేసుకునే దేవుళ్ళ పక్కనే నీ ఫొటో తప్పకుండా ఉంటుంది. నీ లాంటి మంచి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టాడు అంటే ఎంతో సంతోష పడ్డాను. ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే అందరికీ స్వీట్లు పంచిపెట్టాను. అప్పు చేసి.. అంతేకాదు జనసేన జెండా తీసుకుని నా ఇంటిపై ఎగురవేసా. ఇప్పటికీ అది అలానే ఉంది. అయితే ఇక మీదట అది అలా ఉండదు. ఈరోజు నేను ఆ జెండా పీకేస్తున్నాను. నీకు అభిమానిని అని చెప్పుకున్న కారణంగా అందరి ముందు అవమానాలని భరించలేక పోతున్నాను. మీ నాయకుడు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అన్నాడు. ఇప్పటి వరకూ ఏమని ప్రశ్నించాడు..? ఎవరిని ప్రశ్నించాడు అంటూ అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేక తల దించుకున్నాను అన్నా.

నువ్వు పార్టీ పెట్టిన రోజున ప్రశ్నిస్తాను అంటే ప్రజల తరుపున నుంచుని ప్రశ్నిస్తావు అనుకున్నాను. ఈరోజు నువ్వు ప్రశ్నించవలసిన అధికార పక్షాలను వదిలేసి ప్రతిపక్షాలని ఫ్రశ్నిస్తున్నావ్. ఇదేం ప్రశ్నించడం అన్నా. నువ్వు ఎవరిని అయితే తిట్టవో వారో సూపర్ స్మార్ట్ సీఎం అంటున్నావ్. జై తెలంగాణా అన్నావ్. ఇదెక్కడి న్యాయం అన్నా. అందుకే నీ పార్టీ జెండా పీకేస్తున్నా. కేసీఆర్ పాలన బేష్ అంటున్నావ్ అన్నా. ఓ సారి ఆయన్నే కదా అన్న నువ్వు తిట్టింది. మరి ఇప్పుడు ఒక్కసారిగా ఇలా మారిపోయావ్ ఏంటి అన్నా..? నీ ప్రవర్తన చూసి విసుగు వచ్చింది అన్నా. నీకు నీ జెండాకి సెలవు అంటూ ఓ వీరాభిమాని పవన్ కళ్యాణ్ ని బాధతో ప్రశ్నించాడు. ఈ లేఖ చూసిన వారికి నిజమే అడిగాడు కదా.. ఇందులో తప్పేముంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేలా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడని కత్తి మహేష్ అన్న మాటలను గుర్తు చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *