Home > Editorial > ఫసల్‌ బీమా పథకం భరోసా

ఫసల్‌ బీమా పథకం భరోసా

తెలుగు రాష్ట్రాల్లో భూ కంపం
జీఎస్టీకి సిద్ధమౌతున్న రాష్ట్రాలు
 
pradhan-mantri-fasal-bima-yojana_apduniaనిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా  9,712 మంది రైతులే ప్రీమియం కట్టిన వైనం ఆరుగాలం పడించిన పంట ప్రకృతి వైఫరిత్యాల వలన దెబ్బతింటే రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ఫసల్‌ బీమా పథకం ప్రవేశ పెట్టింది. పథకం ఉద్దేశ్యం బానే ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోంది. దీనిపై అవగాహన లేకపోవడంతో రైతులు ముందుకు రావడం లేదు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కేవలం 9,712 మంది రైతులు మాత్రమే వారి పంటలకు బీమా చేసుకున్నారంటేనే అధికారుల అలసత్వం స్పష్టమవుతోంది. దీంతో దేశానికి అన్నం పెట్టే రైతన్న పంటకు భరోసా లేకుండ పోతోంది. జిల్లాలో ఒక లక్ష 81 వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. కాగా వెనుకబడిన ప్రాంతాలైన పిట్లం, జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుంద, మాచారెడ్డి, రామారెడ్డి, గాంధారి, లింగంపేట్‌ తదితర మండలాల్లో సన్న చిన్న కారు రైతులే అధికంగా ఉన్నారు. సన్న, చిన్న కారు రైతులను దృష్టిలో ఫసల్‌ బీమా పథకం ప్రవేశపెట్టారు. అతివృష్టి, అనావృష్టి, తదితర ప్రకృతి, మానవ వైఫరిత్యాల వలన పండించిన పంట నష్టపోతే దానికి గాను ఫసల్‌ బీమా చేసుకున్న రైతులకు నష్టపరిహారాన్ని అందజేస్తుంటారు. ఇప్పటికే రైతులు వ్యవసాయంపై వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగుచేస్తుంటారు. అతివృష్టి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీరికి సంబంధిత అధికారులు బీమా పథకాల సద్వినియోగం గురించి అవగాహన కల్పించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో 22 మండలాల పరిధిలో 2లక్షల 52 మందికి గాను యాసంగిలో కేవలం 9,712 మంది రైతులు మాత్రమే తమ పంటలకు బీమా చేయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో తొలకరి జల్లులు పలకరించగా, రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. పథకాన్ని ప్రవేశపెట్టి రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో మాత్రం రైతులు ముందుకు రావడం లేదు. ప్రతేటా ఖరీఫ్‌, యాసంగి సీజన్‌లో రైతులకు బ్యాంక్‌ అధికారులు పంట రుణాలను అందిస్తూ, అందులో బీమా డబ్బులను ఖాతాలో జమ చేసుకుంటారు. కాగా కొంతమంది రైతులు ముందుకు రాకపోవడంతో బ్యాంక్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. అవగాహన కల్పించాల్సిన వ్యవసాయాది óకారులు పట్టించుకోవడం లేదనే విమర్శలోస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట ఆకాల వర్షం, ఈదురు గాలులు, వడగండ్ల తదితర ప్రకృతి వైఫరిత్యాలతో దెబ్బతినడంతో రైతులు కోలుకోలేకపోతున్నారు. ప్రకృతి వైఫరిత్యాల నుంచి పంటకు రక్షణ కల్పించేందుకు పీఎంఎఫ్‌బీవై పథకానికి కేంద్ర ప్రభుత్వం రెండున్నరేండ్ల క్రితం శ్రీకారం చుట్టింది. సాధారణంగా బ్యాంక్‌ల నుంచి పంట రుణాలు పొందిన రైతుల ఖాతాల నుంచి పంట బీమా ప్రీమియాన్ని మినహాయించుకుంటున్నారు. ఈ బీమా పథకంలో పంట నష్టం చెల్లింపునకు సామూహిక పరిగణలోకి తీసుకుంటు వస్తున్నారు. ఎకరాకు నాలుగు వేల రూపాయల ప్రిమియం చెల్లించినట్లైతే పైరు నాటువేసినప్పటి నుంచి పంట కోసేవరకు బీమా వర్తిస్తుంది. పంటలకు నష్టం వాటిల్లినట్లైతే ఎకరాకు 16వేల నష్టపరిహారాన్ని బ్యాంకులు చెల్లిస్తాయి. దీనిపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *