Home > Bhakti > ఖ‌రారైన భ‌ద్రాద్రి ఆల‌య తుది న‌మూనా..

ఖ‌రారైన భ‌ద్రాద్రి ఆల‌య తుది న‌మూనా..

వరలక్ష్మివ్రతము వరలక్ష్మివ్రతము పురాణ గాధ
లో బావి ప్రాంతంలో నక్షత్ర వనం

final design_apduniaభ‌ద్రాద్రి ఆల‌య అభివ్రుద్ది తుది న‌మూనా సిద్ద‌మైంది. ఆల‌య మాస్టార్ ప్లాన్ ను ప‌రిశీలించిన చిన జీయ‌ర్ స్వామి అద్భుతంగా ఉంద‌ని కితాబిచ్చారు. భ‌ద్రాద్రి ఆల‌యాన్ని టెంపుల్ సిటీగా మార్చాల‌న్న సీఎం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి న‌మూనాల‌ను రూపొందించారు. ఆ న‌మూనాలు ఆగ‌మ‌న శాస్త్రం ప్ర‌కారం లేవ‌ని…కొన్ని మార్పులు, చేర్పులు చేయాల‌ని ఆల‌య వేద పండితులు సూచించారు. వారి సూచ‌న‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి… తుది న‌మూనాల‌ను ఖ‌రారు చేశారు. ఆ న‌మూనాల‌ను చిన జీయ‌ర్ స్వామికి చూయించారు. సోమ‌వారం మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఆల‌య ఈవో శ్రీనివాస్ తో పాటు వేద పండితులు హైద‌రాబాద్ లో చిన‌జీయ‌ర్ స్వామిని క‌లిశారు. సిద్ద‌మైన భ‌ద్రాద్రి ఆల‌య తుది న‌మూనాను జీయ‌ర్ స్వామికి చూయించి…. ఇంకా మార్పులు, చేర్పులు ఉన్నాయోమో సూచించాల‌ని కోరారు. ఆల‌య న‌మూనాను ప‌రిశీలించిన చిన‌జీయర్ స్వామి అద్భ‌తంగా వుందని అన్నారు. మూడు ప్రాంగణాల‌కు సంబంధించి… మొద‌టి ప్రాంగణాన్ని మాత్రం రాతి క‌ట్ట‌డంతో నిర్మించాల‌ని చిన జీయ‌ర్ స్వామి సూచించారు. దేవాల‌య పున‌ర్ నిర్మాణం ఆగ‌మ‌న శాస్త్రం ప్ర‌కారం చేస్తున్నామ‌ని…మాఢ వీధుల నిర్మాణానికి సంబంధించి కొందరు ఇళ్ల కోల్పోతున్న విష‌యాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇళ్లు కోల్పోతున్న వారికి మెరుగైన ప్యాకేజ్ ను అందించాల‌ని ఆల‌య ఈవోను ఆదేశించారు మంత్రి. భ‌ద్రాద్రి తుది మాస్టార్ ప్లాన్ కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల్సివుంది. సీఎం ఆమోద ముద్ర ప‌డ‌గానే… ఆ వెంట‌నే టెండ‌ర్ల‌ను ఖ‌రారు చేయాల‌ని మంత్రి ఆదేశించారు. ఎట్టి ప‌రిస్తితుల్లోనూ ఆగ‌స్టు మాసంలో ప‌నుల‌న్ని పూర్తి చేసి… టెండ‌ర్ల‌కు వెళ్లాల‌ని మంత్రి సూచించారు. వీలైనంత త్వ‌రగా టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను కూడా పూర్తి చేస్తే త్వ‌ర‌లోనే టెంపుల్ సిటీకి శంకుస్తాప‌నకు సిద్దం చేయాల‌ని మంత్రి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *