Home > Vanitha > Beauty > చేప నూనె వలన లాభాలు….

చేప నూనె వలన లాభాలు….

ముఖానికి వ్యాయామం ఎలా..?
మెంతులతో లడ్డూ...

fish-oil-omega-3-apduniaచేపల నుండి ఒమేగా-౩ అనే కీలక ఫాటీ ఆసిడ్ లు అందించబడతాయి. శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి ఈ ఫాటీ ఆసిడ్ తప్పక అవసరం. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, వాటి నిర్మాణానికి చేప నూనెలు తప్పక అవసరం. జుట్టు రాలే ప్రక్రియను ఆపే సహజ చికిత్సగా దీనిని పేర్కొనవచ్చు.

ఆరోగ్యంగా ఉండటానికి పాటించే ఆహర ప్రణాళికలో తప్పక ఉండాల్సిన పదార్థాలలో ముఖ్యమైనది- చేప. ఆరోగ్యకర మరియు ప్రకాశవంతమైన చర్మం కోసం- చేపలు తినండి. చర్మ సమస్యలకు మరియు మొటిమలు రాకుండా ఉండటానికి- చేపలు తినండి. పొడి చర్మం వలన కలిగే దురదల నుండి ఉపశమనం పొందుటకు- చేపలు తినండి. మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి- చేపలను తినండి. ఇలా ఏ విధంగా చుసిన ఆరోగ్య నిపుణులు మరియు వైద్యులు ఎక్కువగా సిఫార్సు చేసేది చేపలనే.

ఆదర్శవంతమైన వ్యక్తిగత జీవితం కావాలనుకుంటున్నారా… అయితే ఈ రకమైన జీవితాన్ని సగం వరకు చేపలను తినటం ద్వారా పొందవచ్చు. ఎక్కువగా చేపలను మరియు వాటిని వినియోగించటం వలన శరీరానికి కావలసిన కీలక పోషకం అయినట్టి ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు శరీరానికి అందించబడతాయి. ఈ రకం ఫాటీ ఆసిడ్ లు మన శరీరానికి అవసరమైనవిగా చెప్పవచ్చు ఎందుకంటే, శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఉండేలా చేసి, రక్త ప్రవాహంలో ద్రావణ స్థాయిలను మెరుగుపరచి, ఇన్ఫ్లమేషన్, నొప్పి మరియు వాపు వంటి వాటిని తగ్గించి వేస్తాయి.

చర్మ అంతర్గత నిర్మాణం
మీరు మొదటగా చర్మాన్ని గమనిస్తారా? ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులలో సమ్మేళనాలను గమనిస్తున్నారా? అయితే చర్మ ఆరోగ్యాన్ని పెంచే చేప మంచి ఎంపికగా చెప్పవచ్చు. భయటకు కనపడే మన చర్మం, అంతర్గత అవయవాల ఆరోగ్యం మరియు మన పూర్తీ ఆరోగ్యం గురించి తెలుపుతుంది.

చేప నూనె జుట్టు ఆరోగ్యాన్ని, చర్మ రూపును మెరుగుపరచటమేకాకుండా, నిర్మాణాన్ని కూడా సరి చేస్తుంది. తక్కువ పొడిగా ఉండటం, గోళ్ళను మృదువుగా మరియు బలంగా మారుస్తుంది. జుట్టు రాలటాన్ని తగ్గించే సహజ ఔషదంగా చేప నూనెగా తెలుపవచ్చు.

మొటిమలు లేని చర్మం

మీ ముఖ: చర్మంపై మొటిమలు, వాటి వలన కలిగిన మచ్చలు ఉన్నాయా! అయితే చేపనూనె మంచి ఎంపికగా చెప్పవచ్చు. కళంకంలేని చర్మాన్ని పొందుటకు గానూ, ఎక్కువ మొత్తంలో చేపనూనెను వాడండి. చేప నూనె వంటి ఎసెన్షియల్ ఆయిల్ లను నోటి ద్వారా తీసుకోవటం వలన శరీర అంతర్గత మరియు బహిర్గతంగా అన్ని విధాల మెరుగుపరుస్తుంది. ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు చర్మాన్ని మరమ్మత్తులకు గురి చేసి, తేమ స్థాయిలను పెంచి, మృదుత్వాన్ని పెంచుతుంది.

బరువు తగ్గించుటలో సహాయం
కొవ్వు పదార్థాలను ఎక్కువగా తినటం ద్వారా శరీర బరువు అధికంగా కలిగి ఉన్న వారు బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా! అయితే ఆరోగ్యకర ఎసెన్షియల్ నూనెలు తప్పని సరి అవసరం. మనలో చాలా మంది శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు పదార్థాలను తగ్గించుకోటానికి గానూ, పాటించే పోషకాహార ఆహార ప్రణాళిక నుండి ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను తొలగిస్తారు. వైట్ ఫిష్ తక్కువ క్యాలోరీలను, ప్రోటీన్ లను ఎక్కువగా మరియు తక్కువ స్థాయిలో ఫ్యాట్ లను కలిగి ఉంటుంది. చేపలో నూనెలో ఉండే ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు, ఆరోగ్యాన్ని పెంపొందించటమే కాకుండా, అధిక బరువును కూడా తగ్గిస్తాయని పరిశోధనలలో వెల్లడించబడింది. కావున, మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అనుకంటే రెడ్ మీట్ కు బదులుగా చేపలను మీ ఆహార ప్రణాళికలో చేర్చుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *