Home > Love Life > శృంగార శక్తిని పెంచే పూలు…

శృంగార శక్తిని పెంచే పూలు…

మహిళలతో జరజాగ్రత్త గురూ.. శృంగారమే జీవితం కాదు..

pink-flowers-apduniaప్రకృతి మనకు ఎన్నో అందమైన, సువాసనలతో కూడిన పుష్పాలను ఇచ్చింది. ఈ పువ్వుల్లో ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేక గుణం ఉంటుంది. మానవుని జీవితంలో సగం దాంపత్యానికే కేటాయించబడుతుంది. ఈ దాంపత్య జీవితం సుఖమయంగా, సాఫీగా సాగేందుకు కొన్ని రకాల, రంగుల పుష్పాలు ఎంతగానో దోహదపడతాయి.

పింక్ పూలతో శృంగార శక్తి డబుల్: పింక్ కలర్ పూలకు పడకగదిలో చోటిస్తే దంపతుల్లో శృంగారం రెట్టింపవుతుందట. ఊదా రంగు పూలకు హృదయాలను స్పందింపజేసే శక్తి, రొమాంటిక్ ఆలోచనలు రేపే లక్షణం ఉంది. కనుక బెడ్రూంలో ఈ పూలకు స్థానం కల్పిస్తే సుఖసాంసారం సొంతం.

ఆహ్లాదమైన సాయంత్రపు వేళల్లో రోజా: రోజా పూల గురించి వేరే చెప్పక్కర్లేదు. అయితా సాయంత్రపు వేళల్లో ఆహ్లాదంగా, ఆనందంగా గడపేందుకు ఎర్రెర్రని రోజాపూలు ఎంతగానో దోహదపడతాయి. ఈ పూలకు ఇంట్లో హాలులో స్థానాన్ని కల్పిస్తే మీ ఇంటికి వచ్చేవారికీ, మీకూ ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తాయి.

అనారోగ్యాన్ని తరిమేసే పసుపు, నారింజ పూలు: అనారోగ్యంగ ఉన్నవారిలో సత్తువ, శక్తిని రేకెత్తించడానికి పసుపు, నారింజ రంగు పూలు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా అనారోగ్యంతో సతమతమవుతున్నవారిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఈ రంగుపూలతో కూడిన చిన్న బొకేను ఇస్తే వారికి స్వాంతన చేకూర్చినట్లవుతుంది.

పుట్టినరోజు వేడుకలకు అనేక పువ్వుల కలబోత: పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలకు మీకు అత్యంత ఇష్టమైన పలు రకాల పువ్వులను కలిపి అందిస్తే సంతోషం రెట్టింపవుతుంది. డబ్బు, ఇతర బహుమతులతో రానటువంటి సంతోషం పువ్వులతో వస్తుంది కనుక ఆయా సందర్భాల్లో పూలను ఉపయోగిస్తే జీవితం ఆనందమయం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com