Home > Politics > ఖచ్చితమైన హామీతో ఎన్నికలకు : వైఎస్ జగన్

ఖచ్చితమైన హామీతో ఎన్నికలకు : వైఎస్ జగన్

కలకలం రేపుతున్న హార్దిక్ పటేల్ రాసలీలలు
వైద్యానికి జీవం : సీఎం కేసీఆర్
 
jagan letterకడప జిల్లా లో 4 వ రోజు ప్రజా సంకల్పం యత్ర లో తీవ్రమైన నడుము నోప్పితో బాదపడుతున్నా జగన్ పాదయాత్ర ను యధావిధిగా కోనసాగించారు. ఉరుటూరు నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. సర్వరాజుపేట, పెద్దనపాడు, హనుమాన్ జంక్షన్, వై.కోడూరు జంక్షన్, ఎర్రగుంట్ల, ప్రకాశ్‌ నగర్‌ కాలనీ మీదుగా పాదయాత్ర సాగనుంది.ఈ రోజు యాత్ర లో అనంతరం తిరిగి  హైదరాబాద్ కు.బయలుదేరి వెళ్తారు. శుక్రవారం కోర్టుకు హజరు కావాల్సి ఉన్నందున తిరిగి శనివారం నుంచి యాత్ర కోనసాగిస్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం వై.కోడూరు జంక్షన్‌లో రైతులతో ముచ్చటించారు. పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను రైతులు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. మినుములు, శనగలు వంటి పంట ధాన్యాలకు మద్దతు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల సమయంలో ప్రతి పంటకు మద్దతు ధరను ముందే ప్రకటిస్తామని, ప్రతి పంటకు ఇది మీ రేటు అని, అంతకన్నా తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి రాబోదని కచ్చితమైన హామీ ఇచ్చి ఎన్నికలకు వెళుతామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ప్రతి పంటకు సరైన మద్దతు ధరను ప్రకటిస్తామని తెలిపారు. పంటలకు మద్దతు ధర కల్పించేందుకు రూ. ఐదువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు.. ఇందుకు రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *