Home > Health > ఆ చేప కూర వండాలంటే నాలుగేళ్ళు శిక్షణ తీసుకోవాలట

ఆ చేప కూర వండాలంటే నాలుగేళ్ళు శిక్షణ తీసుకోవాలట

నోటికి మరియు ఆరోగ్యానికి సంబంధం ఏమిటి?
పాము కరిచిందా అయితే ఇలా చేయండి..

pugu fish_apduniaజపనీయులకు ఓ చేప కూర అంటే అమితమైన ఇష్టం. కానీ ఆ కూర వండాలంటే మాత్రం నాలుగేళ్ళు శిక్షణ తీసుకోవాల్సి ఉందట. జపాన్ దేశంలో లాగొసెఫలస్‌ జాతికి చెందిన పుఫ్పర్‌ ఫిష్‌‌ను ఆ దేశ ప్రజలు ‘ఫుగు’ అనే పిలుస్తారు. దీనిని వారు అమితంగా ఇష్టపడతారు. అయితే ఈ చేప అత్యంత విషపూరితమైనది. దీని కాలేయం, కళ్లు, ఇతర అవయవాల్లో టెట్రొడొటాక్సిన్‌ అనే విషపదార్థం ఉంటుంది. ఇది సైనైడ్‌ కన్నా 1200 రెట్లు అధికంగా ప్రభావం చూపుతుంది. ఈ విషం శరీరంలోకి ప్రవేశించిన క్షణాల్లో మనిషి కండరాల కదలిక ఆగిపోయి, ఊపిరి ఆడక చనిపోతారు. ఇంత ప్రమాదకరమైన ఈ చేపను తినేందుకు జపనీయులు చాలా ఆసక్తి చూపుతారు. దీనిని వండేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్‌లను నియమించుకుంటారు. ఈ చేపను గుర్తించడం, కోయడం, శుభ్రం చేయడంలో మూడేళ్లు, వండటంలో కనీసం ఏడాది ఇలా మొత్తం నాలుగేళ్ల శిక్షణ పొందాల్సి ఉంది. ఆ తర్వాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులకు మాత్రమే ఈ చేపను వండేందుకు అనుమతి ఇస్తారు. వారిని మాత్రమే రెస్టారెంట్లు చెఫ్‌లుగా నియమించుకుంటాయి. అనుభవం లేకుండా ఫుగు చేపతో వంటకాలు చేస్తే తినేవారికి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందట. పైగా జపాన్‌లో ఈ వంటకం చాలా ఖరీదైనది.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *