Home > Politics > 11 నుంచి ఇంటింటికి టీడీపీ

11 నుంచి ఇంటింటికి టీడీపీ

ఉరవ కొండలో బాబు సీఎల్ ఐడీ పధకానికి శంకుస్థాపన
పవన్ సూచనతో జీవో 64 రద్దు

telugudesamఈనెల 11వ తేదీ నుండి 60రోజులపాటు నిర్వహించనున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఈనెల 11వతేదీనుండి రాష్టవ్య్రాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనున్నారు. ప్రధానంగా ఈకార్యక్రమం సందర్బంగా రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమపధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ముఖ్యమంత్రి నేతలను ఆదేశించారు.ముఖ్యంగా వృద్దాప్యపెన్షన్లు, రేషన్‌కార్డులు, గృహనిర్మాణం, ఎస్‌సి,ఎస్‌టి,బిసి సంక్షేమం, రోడ్ల అభివృద్దితోపాటు ప్రాజెక్టుల పురోగతిపై నేతలు ప్రజలకు వివరించనున్నారుఆదేశించారు.2018సంవత్సరం ఆఖరులోకాని, 2019 సంవత్సరం మే నెలలో కాని అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని అందువలన ఆ ఎన్నికలకు నేతలు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అంతిమంగా ప్రజలతో మమేకమయ్యే నాయకులకే రానున్న ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయించటం జరుగుతుందని అసమ్మతి నేతలనుద్దేశించి ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీచేశారు. ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అభ్యర్ధులు ఘనవిజయం సాధించారని , వైసిపికంటే తెలుగుదేశంపార్టీకి 16శాతం ఓటింగ్ పెరిగిందని మరో 10శాతం పెరగాలని ఆయన పార్టీశ్రేణులను ఆదేశించారు. ప్రధానంగా పార్టీపట్ల ఓటుబ్యాంకు పెరిగే విధంగా పార్టీనేతలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల సమస్యలపై నిరంతరం నేతలు స్పందించి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ముఖ్యమంత్రి నేతలకు హితబోధ చేశారు. మొత్తంమీద ఒకవైపు రాష్టప్రార్టీపురోభివృద్ధిపై దృష్టిసారిస్తూనే మరోకపక్క రాష్ట్రప్రభుత్వం అవలంబిస్తున్న పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హితబోధ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *