Home > Bhakti > జూన్ 12 నుండి 16వ తేదీ వరకు కోదండరామాలయ మహాసంప్రోక్షణ

జూన్ 12 నుండి 16వ తేదీ వరకు కోదండరామాలయ మహాసంప్రోక్షణ

శ్రీవారూ పన్ను చెల్లించాల్సిందే
జనవరి 31 నుంచి సమ్మక్క-సారక్క జాతర
 
release of poster_apduniaతిరుపతిలోని శ్రీ కోదండరామాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ జూన్ 12 నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 12న సాయంత్రం 6.00 నుంచి 7.00 గంటల వరకు సేనాధిపతి తిరువీధి ఉత్సవం, ఆ తరువాత మృత్సంగ్రహణం, అంకురార్పణం జరుగనుంది. జూన్ 13న మొదటిరోజు సాయంత్రం 6.00 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం  ఉంటుంది. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించరు. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 10.00 గంటల వరకు అగ్నిప్రతిష్ట, కుంభస్థాపన, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 14, 15వ తేదీల్లో ఆలయంలో మూలవర్ల దర్శనం ఉండదు. జూన్ 14న ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, అన్ని దేవతామూర్తులకు అష్టబంధనం చేపడతారు. జూన్ 15న సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు మహాశాంతి పూర్ణాహుతి నిర్వహిస్తారు. రాత్రి 9.00 నుంచి 10.00 గంటల వరకు శయనాధివాసం, హౌత్ర ప్రశంసనం చేపడతారు. జూన్ 16న ఉదయం 6.00 నుంచి 7.30 గంటల వరకు మిధున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుండి భక్తులను శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి మూలవర్ల దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.00 నుంచి 7.00 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణం జరుగనుంది. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్తులు ఈ కల్యాణం ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. 
అదేరోజు రాత్రి 8.00 నుంచి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ సీతారామ లక్ష్మణులు భక్తులకు దర్శనమిస్తారు.  
శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి మూలవర్లకు, జయవిజయులు, శ్రీవిష్వక్సేనులు, శ్రీరామానుజులు, శ్రీగరుడళ్వార్, పోటులోని శ్రీమహాలక్ష్మీఅమ్మవారు, పరివార దేవతలకు, ఆలయం చుట్టు వున్న 20 బలిపిఠాలు, ఆలయం ఎదురుగా వున్న శ్రీఅంజనేయస్వామివారికి అష్టబంధన కార్యక్రమం నిర్వహించనున్నారు. మహాసంప్రోక్షణ కార్యక్రమాల కోసం ఆలయంలోని ఊంజల్ మండపం వద్ద ప్రత్యేకంగా యాగశాలను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 21 హోమగుండాలు, 15 వేదికలు తీర్చిదిద్దారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 40 మంది రుత్వికులు, 14 మంది టిటిడి వేదపారాయణదారులు, 10 మంది వేదపాఠశాల విద్యార్దులు, ఆలయ అర్చక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *