Home > Tirumala News > ఆగస్టు 7 మధ్యాహ్నం నుంచి శ్రీ వారి ఆలయం మూసివేత

ఆగస్టు 7 మధ్యాహ్నం నుంచి శ్రీ వారి ఆలయం మూసివేత

ఎట్టకేలకు దిగొచ్చిన టీటీడీ
నెలరోజులపాటు పుష్కరిణీ మూసివేత

tirumala temple cosed_apduniaశ్రీవారిని దర్శించుకోడానికి ఆగస్టు 7 న భక్తులు తిరుమలకు రాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని టిటిడి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీవారి ఆలయాన్ని ఆ రోజు మూసేయనున్నారు కాబట్టి రాకపోవడమే ఉత్తమని అంటున్నారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఆగస్టు 7న మూసివేయనున్నట్లు తితిదే ప్రకటించింది. ఆగస్టు 7 రాత్రి 10.52 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి 12.48 గంటలకు పూర్తి అవుతుంది. దీంతో శ్రీవారి ఆలయాన్ని 7 సాయంత్రం 4.30 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటల వరకు మూసివేయనున్నారు. 8వ తేదీ వేకువ జామున ఆలయాన్ని తెరచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు.సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల అనంతరం ఉదయం 7 గంటలకు శ్రీవారి దర్శనాన్ని ప్రారంభమవుతుంది. ఆలయంలో దర్శనానికి అనుమతించిన వెంటనే అప్పటికే వేచి ఉన్న భక్తులతో పాటు విఐపిల తాకిడి కలిస్తే సామాన్యులు గంటల తరబడి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుందనే ఉద్దేశంతోనే తితిదే ముందుగానే ప్రకటనలను చేస్తోంది. కానీ భక్తులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా స్వామివారి దర్శనం కోసం ఎంతసేపయినా వేచి చూసేందుకు సిద్థమవుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *