Home > Movies > మెర్సల్ కు అమెరికాలో ఫుల్ కలెక్షన్స్

మెర్సల్ కు అమెరికాలో ఫుల్ కలెక్షన్స్

భాగమతి ఫస్ట్ లుక్ విడుదల
ఎన్టీఆర్ బయోపిక్ లో జగపతిబాబు
 
vijayవిజయ్ నటించిన మెర్సల్ సినిమా విడుదలై రికార్డుల మోత మోగించింది. దాంతోపాటు వివాదాలు కూడా ఈ సినిమాను చుట్టుముట్టాయి. అయితే అమెరికాలో బాహుబలి తర్వాత ఏ దక్షిణాది సినిమాకు రానంత క్రేజ్ ఈ సినిమాకు వచ్చింది. మెర్సల్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసిందని ట్రెడ్ వర్గాలు విశ్లేషించాయి. హిందీ ఎక్కువగా మాట్లాడే ఉత్తరాది ప్రజలే ఉత్తరఅమెరికాలో ఎక్కువగా స్థిరపడ్డారు. తమిళుల సంఖ్య వారితో పోలిస్తే చాలా తక్కువ. ఈ సినిమా భాష బేధం లేకుండా దాదాపు 12 కోట్ల  కలెక్షన్లు రాబట్టిందని ట్రెడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఏ తమిళ హీరో సినిమా కూడా ఈ రేంజ్‌లో ఉత్తరఅమెరికాలో కలెక్షన్లు రాబట్టలేదని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. రజనీ సినిమాలకే అమెరికాలో ఈ స్థాయి కలెక్షన్లు వస్తుంటాయి. రజనీ సినిమాల తర్వాత విజయ్ సినిమాకే ఆ ఘనత దక్కింది. అయితే రజనీ సినిమాలకు అమెరికాలో మంచి క్రేజ్ ఉన్న ఉత్తరఅమెరికాలో మెర్సల్ స్థాయి కలెక్షన్లను ఎన్నడూ రాబట్టలేదని విశ్లేషకుల మాట. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *