Home > Movies > కొడకా కోటేశ్వరరావుతో ఫుల్ జోష్…

కొడకా కోటేశ్వరరావుతో ఫుల్ జోష్…

ఏప్రిల్ 14న 2.0 రిలీజ్
రూ.50 కోట్ల క్ల‌బ్‌లోకి నాని ఎంసీఏ

pawan-song-agnathavasi-adpuniaనూతన సంవత్సర కానుకగా అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ కొడకా కోటేశ్వర్రావు పాటను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించిన ఈ సాంగ్.. యువతను ఊపేస్తోంది. పవన్ అద్భుతంగా పాడిన ఈ పాటను కాసేపట్లోనే 5 లక్షల మంది వీక్షించడాన్ని బట్టి యూత్‌ను ఎంతగా ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. శర్మ గారూ.. అంటూ సాగే పాట నిజంగానే క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. పాట వింటున్నంత సేపు కాలు కదపకుండా ఉండలేనంతగా.. సూపర్బ్‌గా ఉంది. అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ పాడిన ‘కాటమరాయుడా కదిరీ నరసింహుడా’ అనే పాటకి మించిన స్థాయిలో ఈ సాంగ్ ఉందంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.సినిమా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఆడియోను విడుదల చేయగా.. పాటలు ఆకట్టుకుంటున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com