Home > General > కనువిందు చేస్తున్న తుంగభద్ర తీరం

కనువిందు చేస్తున్న తుంగభద్ర తీరం

కోడి గుడ్లతో కొత్త చిక్కులు
గ్రేటర్ లో మెరుగైన ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ‌కు 30జంక్ష‌న్ల అభివృద్ది

sunkesula-reservoir-apduniaఎగువ కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ కు రెండు రోజులుగా వరద నీరు పోటెత్తింది. కర్నూలు, కడప జిల్లాల జీవ నాడి అయిన సుంకేసుల జలాశయంలో పూర్తి సామర్థ్యం నీరు చేరింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. ఇటు తుంగభద్ర కు వరద నీరు చేరడం తో నది తీరాన ఉన్న గ్రామాల్లో రైతులు పొలం పనులలో నిమగ్నమయ్యారు…కృష్ణమ్మలో కలిసేందుకు తుంగభద్ర పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. కర్నూలు జిల్లాతోపాటు ఎగువన కర్ణాటక పరిధఇలో కురుస్తున్న వర్షాలకు సుంకేశుల జలాశయానికి ఆదివారం 20,318 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.20 టీఎంసీలకు చేరింది. సుంకేశుల బ్యారేజీ 4 క్రస్ట్ గేట్లు ఒక మీటరు చొప్పున ఎత్తి 17,784 క్యూసెక్కులు శ్రీశైలం రిజర్వాయరుకు విడుదల చేస్తున్నారు. ఆరుతడి పంటల కోసం కేసీ కాల్వకు, కర్నూలు నగర తాగునీటి అవసరాలకు 2,534 క్యూసెక్కులు విడుదల చేశారు. మరోవైపు శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ఆదివారం 819.95 అడుగుల వద్ద 40.7559 టీఎంసీలు వరద చేరింది. జూరాల జలాశయం నుంచి 24 వేలు, సుంకేశుల బ్యారేజీ నుంచి 17,784 క్యూసెక్కులు కలిపి 41,784 క్యూసెక్కులు శ్రీశైలంలో వచ్చి చేరుతోంది.ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర కు నీరు చేరడంతో జిల్లాలో ఉన్న సుంకేసుల, శ్రీశైలం డ్యామ్ లకు నీరు భారీగా చేరుతోంది. ఇటు శ్రీశైలంకు జూరాల నుంచి కూడా నీరు చేరడంతో… బ్యాక్ వాటర్ నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కింద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు భారీగా వరద నీరు రావడంతో తుంగభద్రా నది తీరాన ఉన్న గ్రామాల రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటు కేసీ కెనాల్ కూడా నీటితో ప్రవహిస్తోండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *