Home > General > పింఛా ప్రాజెక్టుకు జలకళ

పింఛా ప్రాజెక్టుకు జలకళ

త్వరలో వంద రూపాయిల కాయిన్
ఏపీలో కంచె ఐలయ్య పుస్తకం నిషేధం

pincha-project-dam-apduniaపింఛా ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. కడప-చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన పింఛా సమీపంలోని యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి పింఛా ప్రాజెక్టులోకి 94 అడుగుల వర్షపునీరు చేరింది. పింఛా ప్రాజెక్టు నిండాలంటే మరొక నాలుగు పదన్ల వర్షం పడితే చాలని ప్రాజెక్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే కరవు కాటకాలను ఎదుర్కొంటూ వస్తున్న రైతుల్లో ఆనందం చిగురిస్తోంది. పింఛా పూర్తి సామర్థ్యం నీరు చేరితే ప్రతి యేటా రెండు పంటలు పండించవచ్చని రైతులు చెప్పుకొంటున్నారు. కుడి, ఎడమ కాలువల ఇరువైపులా పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. కాలువలో రాళ్లు, రప్పలు, చెత్తాచెదారంతో నిండి ఉన్నాయి. వీటిని దాటి పూర్తి స్థాయిలో నీరు రైతు పొలాలకు చేరాలంటే ప్రభుత్వం పింఛా అధికారులు కాస్త కరుణించాలి. కొన్నిచోట్ల కాలువలలో కాలువ గట్లు కూలిపోయాయి. వాటిపైన అధికారులు చొరవ చూపాలి. ఇప్పటికే రైతులు పలు రకాల పంటలను పింఛా దిగువ భాగంలో సాగు చేశారు. పింఛా ప్రాజెక్టు 5 వేల కుటుంబాలకు జీవనాధారం. అవసరమైనపుడు నీటిని విడుదల చేయాల్సిన అవసరముంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పింఛా నీటి సంఘం ఎన్నికలు జరిగాయి. అనంతరం పింఛా కాలువల మరమ్మత్తుల కోసం అక్షరాలా కోటి రూపాయల నిధులను మంజూరు చేసింది. అలాగే చెరువులలో పూడికతీత పనులు, గట్టుల నిర్మాణం, తూముల ఏర్పాటు కోసం రూ.60 లక్షల నిధులను విడుదల చేశారు. ఆ నిధులను అర్దకుంట, రాములకుంట, బూడిదేటిపల్లె చెరువు, సుబ్బయ్యకుంట, కొత్తకుంట, రెడ్లచెరువుల పనుల కోసం వెచ్చించినట్లు తెలిసింది. అయితే ఏ మేరకు పనులు చేశారో అధికారుల పర్యవేక్షణ క్వాలిటీ కంట్రోల్ అధికారులపై బాధ్యత ఉంది. అయితే కాలువల కోసం విడుదలైన కోటి రూపాయలతో ఏమాత్రం పనులు చేశారో అర్థం కావడం లేదు. ఇపుడు ప్రాజెక్టులో నీరు చేరి రైతులకు అందాల్సిన సమయంలో కాలువలు అస్తవ్యస్థంగా ఉన్నాయి. చెట్లు తొలగించాలంటే కుడి, ఎడమ కాలువలకు కనీసం రూ.15 లక్షలు కావాలని అంటున్నారు. నీరు-చెట్టు పనుల ద్వారా పనులు చూపాలని విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి జలసిరికి హారతి కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కోరారు. అయితే లక్షల రూపాయలు వెచ్చించి ఉపాధి పనులు చేస్తున్నారు. ఉపాధి కూలీలను కాలువ పనులు చేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశిస్తే కాలువలకు పూర్వవైభవం వస్తుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *