Home > Crime > నట్టింట్లో గంజాయి వనం

నట్టింట్లో గంజాయి వనం

సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని పిలిచాడు.. గదిలో బట్టలు మార్చడాన్ని వీడియో తీశాడు
ఒకరి వ్యసనం మరొకరి ప్రాణం తీసింది

ganjayi_apduniaగంజాయిని ఎక్కడో ఏజెన్సీ ఏరియాలోనో, దట్టమైన అటవీ ప్రాంతంలోనో, కొన్ని రకాలైన పంటల మధ్యనో దొంగచాటుగా సాగు చేస్తారని ఇప్పటిదాకా తెలుసు! కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా అపార్ట్‌మెంట్‌లోనే దర్జాగా గంజాయి సాగు మొదలెట్టేశాడు. పూల కుండీలు, ప్లాస్టిక్‌ గ్లాసుల్లో సాగు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గంజాయి మొక్కలు ఏపుగా పెరగడానికి ప్రత్యేకంగా లైట్లు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసిన ఇతడు విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను టార్గెట్‌గా చేసుకుని వ్యాపారం చేసేందుకు పథకం వేశాడు. ఇంతలోనే సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కినట్లు అదనపు డీసీపీ ఎన్‌.కోటిరెడ్డి సోమవారం వెల్లడించారు. గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మణికొండ ఫ్రెండ్స్‌ కాలనీకి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి సయ్యద్‌ షాహెద్‌ హుస్సేన్‌ వైకే రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. గంజాయి సేవించడం అలవాటు ఉన్న ఇతడు కొన్నాళ్లకు విక్రేతగా మారాడు. నగరానికి సమీపంలోని తాండూరులో కేజీ రూ.3,500 చొప్పున గంజాయి ఖరీదు చేసుకొని వచ్చి ఇక్కడ రూ.16 వేల చొప్పున అమ్మేవాడు. ఈ క్రయ విక్రయాల నేపథ్యంలో హుస్సేన్‌కు మూడు నెలల క్రితం గంజాయి సాగు ఆలోచన వచ్చింది. ఎక్కడో పండించిన గంజాయి ఎన్నో రోజుల తర్వాత తీసుకువచ్చి విక్రయిస్తున్నా లాభం వస్తోందని, అలాగాకుండా తానే పండించి ‘ఫ్రెష్‌ మాల్‌’ను విక్రయిస్తే మరింత లాభాలు పొందచ్చని భావించాడు. ఆ ఆలోచనను వెంటనే అమల్లో పెట్టి ఫ్లాట్‌నే పొలంగా మార్చేశాడు. హాలు, లివింగ్‌ ఏరియా, కారిడార్‌ల్లో 40 కుండీల్లో గంజాయి సాగు చేశాడు. ఈ పంట చేతికి వచ్చిన తర్వాత నగరంలోని విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు విక్రయించేందుకు పథకం వేశాడు. ఈ లోపు ఇతర ప్రాంతాల నుంచి సేకరించిన గంజాయిని విక్రయించడం కొనసాగించాడు. ఇటీవల కొన్న 8.6 కేజీల గంజాయిని అమ్మడానికి సోమవారం గోల్కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.యాదగిరి నేతృత్వంలో ఎస్సైలు తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు. ఇతడిని విచారించగా.. ఫ్లాట్‌లో గంజాయి సాగు వెలుగులోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *