Home > General > గ్రేటర్ లో మెరుగైన ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ‌కు 30జంక్ష‌న్ల అభివృద్ది

గ్రేటర్ లో మెరుగైన ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ‌కు 30జంక్ష‌న్ల అభివృద్ది

కనువిందు చేస్తున్న తుంగభద్ర తీరం
వచ్చే ఏఢాది నాటికి ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ

ghmc-apduniaన‌గ‌రంలో ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ‌ మ‌రింత సుల‌భ‌త‌రం ఉండేందుకుగాను ప్ర‌ధాన జంక్ష‌న్ల‌ను అభివృద్ది చేయ‌డానికి జీహెచ్ఎంసీ ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేస్తోంది. అర్భ‌న్ జంక్ష‌న్ ఇంప్రూమెంట్ ప్లాన్ పేరుతో జీహెచ్ఎంసీ ట్రాఫిక్‌, ట్రాన్స్‌పోర్ట్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో మొద‌టి ద‌శ‌లో 30 జంక్ష‌న్ల‌ను స‌మ‌గ్రంగా అభివృద్ది చేయ‌డానికి నివేదిక రూపొందించారు. రానున్న ఐదు నుండి ఏడు సంవ‌త్స‌రాలలో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని చేప‌డుతున్న జంక్ష‌న్ అభివృద్దిలో భాగంగా ప్ర‌యాణ కాలాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డం, ఫ్రీ లెఫ్ట్ సుల‌భంగా కావ‌డానికి త‌గు ఏర్పాట్లు పాదాచారుల‌కు త‌గు సౌక‌ర్యాలతో పాటు ర‌హ‌దారి భ‌ద్ర‌తకు కావాల్సిన మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నారు. ఇప్ప‌టికే పూర్తి అయిన జంక్ష‌న్ల అభివృద్దిలో పాదాచారుల రెఫ్యూజి ఐల్యాండ్‌లు, గార్డ్‌డ్రిల్‌ల‌ను, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, పెలికాన్ క్రాసింగ్‌లు త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించారు. జంక్ష‌న్ అభివృద్దిలో భాగంగా క్యారేజ్‌-వే విస్త‌ర‌ణ‌, ఫ్రీ లెఫ్ట్‌కుగాను త‌గు గుర్తుల ఏర్పాటు, రోడ్డు మార్కింగ్‌లు, సైన్‌బోర్డుల ఏర్పాటు త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను కూడా బ‌ల్దియా ట్రాఫిక్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం క‌ల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *