Home > Love Life > యావరేజ్ గా ఉంటేనే బెటర్ అంటున్న అమ్మాయిలు

యావరేజ్ గా ఉంటేనే బెటర్ అంటున్న అమ్మాయిలు

పురుషులకు ఇక గర్భం...
వివాహేతర సంబంధాల్లో వారే ఎక్కువట

girls-says-boys-apduniaఅబ్బాయిలు హ్యాండ్సమ్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటేనే అమ్మాయిలు ఇష్టపడతారని చాలా మంది భావిస్తుంటారు. కానీ తమకు కాబోయే పార్టనర్ మిస్టర్ పర్ఫెక్ట్ కానక్కర్లేదని, చూసేందుకు యావరేజ్‌గా ఉన్నా చాలని అమ్మాయిలు భావిస్తారట. హ్యాండ్సమ్‌గా ఉన్న అబ్బాయి వేరే అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తాడని భావించడమే ఇందుకు కారణమట. ఇటీవల ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేవలం ఏడు శాతం మంది అమ్మాయిలు మాత్రమే పర్ఫెక్ట్ పార్టనర్‌ను కోరుకుంటున్నారట. మెజార్టీ అమ్మాయిలు మాత్రం.. ఫర్వాలేదు అనేలా ఉండే ఉండే అబ్బాయిలకే ఓటేస్తున్నారట. ఆకర్షించే విషయంలో సగటు వ్యక్తులవైపే అమ్మాయిలు మొగ్గు చూపుతున్నారు.సగటుగా ఉండే అబ్బాయిలకు 40 శాతం మంది సరేనంటే.. పది పాయింట్ల పట్టికలో 8 పాయింట్లు ఇచ్చేలా ఉన్నఅబ్బాయిలకు 22 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. 15 శాతం మంది మాత్రమే మిస్టర్ పర్‌ఫెక్ట్‌లను తమ పార్టనర్‌గా ఎంచుకుంటున్నారు. ఆకర్షణ విషయంలో పార్టనర్ తమను డామినేట్ చేయొద్దని సగం మంది అమ్మాయిలు భావిస్తారట.అత్యంత ఆకర్షణీయంగా ఉండే పార్టనర్ వల్ల అమ్మాయిలు కొంచెం అభద్రతా భావానికి లోనవుతారట. కాబట్టి మరీ అంత అట్రాక్టివ్‌గా లేకపోవడమే పెద్ద ప్లస్ అన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com