Home > Movies > విడుదలకు రెడీ అవుతున్న పంతం…

విడుదలకు రెడీ అవుతున్న పంతం…

వరుస హిట్లతో తేజ జోష్..
కోటి హృదయాలను మీటిన పాట...

gopichand-apduniaఒకప్పుడు వరస హిట్లతో నిర్మాతల హీరోగా వెలుగొందిన గోపీచంద్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ‘ఆంధ్రుడు’, ‘య‌జ్ఞం’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, ‘లౌక్యం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను గోపీచంద్ మెప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ‘జిల్’, ‘ఆక్సిజన్’, ‘గౌతమ్‌నంద’ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే ‘పంతం’తో గోపీచంద్ రంగంలోకి దిగాడు. గోపీచంద్ హీరోగా శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘పంతం’. ‘ఫ‌ర్ ఎ కాస్‌’ అనేది ఉప‌శీర్షిక‌. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావ‌డం విశేషం.బ‌లుపు’, ‘ప‌వ‌ర్‌’, ‘జైల‌వకుశ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రానికి ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం నిర్మాత రాధామోహన్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ బ్యానర్‌లో గోపీచంద్ 25వ సినిమా చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం చిత్రీకరణ జరుగుతోందని, ఇప్పటికే ఒక పాట, టాకీ పార్ట్ పూర్తయ్యాయని వెల్లడించారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలను అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించామని చెప్పారు. సినిమాలో గోపీచంద్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిపారు.ఈ చిత్రంలో గోపీచంద్‌కు జంటగా మెహరీన్ నటిస్తోంది. పృథ్వీ, జ‌య‌ప్రకాష్ రెడ్డి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కె.చక్రవర్తి (చక్రి). రమేష్ రెడ్డి మాటలు, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *