Home > Bhakti > తిరుమలపైనా గ్రహణం ఎఫెక్ట్

తిరుమలపైనా గ్రహణం ఎఫెక్ట్

నాలుగు రోజుల అంగరంగ జాతర
రథసప్తమికి సిద్ధమవుతున్న తిరుమల

tirumala-apduniaజనవరి 31న తిరుమలలో శ్రీవారి ఆలయం మూత పడనుంది. చంద్రగ్రహణం సందర్భంగా దాదాపు 11గంటల పాటు ఆలయాన్ని మూసివేయనున్నా టీటీడీ అధికారులు. ఈ నెల 31 వ తేదీ బుధవారం ఉదయం స్వామి వారికి సుప్రభాతం, అర్చన, తొమాల సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆర్జిత సేవలన్ని రద్దు చేశారు. గ్రహణం కంటే 7గంటల ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయటం అనవాయితీగా వస్తోంది. ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయాన్ని ఒకరోజు మూసివేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో ఎటువంటి దర్శనాలు ఉండవు కాబట్టి భక్తులు సహకరించి పర్యటనలను వాయిదా వేసు కోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణంగా ఏడాదిలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజుల్లో దేశంలోని వైష్ణవాలయాలు అన్నీ మూతపడుతాయి. ఈ నేపథ్యంలో తిరుమల ఆలయాన్ని సైతం మూసివేసే సాంప్రదాయం ఉంది. గ్రహణం సమయంలో వెలువడే విష కిరణాలు శ్రీవారి ములవిరాట్టు, ఉత్సవ మూర్తులకు సోకకుండా గర్భాలయాన్ని ముసివేస్తారు. గ్రహణం సమయంలో గర్భిణిలు బయట రాకుడదని, ఈ తంతు ముగిసేవరకు ఆహారం తీసుకోరాదని తిరుమలలో అన్నప్రసాద కేంద్రాన్ని కూడా మూసివేస్తున్నారు.

చంద్ర గ్రహణం వీడిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పుణ్యహవచనం నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు ప్రాణాళిక బద్దంగా తమ ప్రయాణాలను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది. గ్రహణం వీడిన తర్వత తిరిగి అన్నప్రసాదాలు భక్తులకు అందిస్తుంది టిటిడి. గ్రహణం నేపథ్యంలో భక్తులకు కేటాయించే దివ్యదర్శన టోకెన్లు రద్దయ్యాయి. ఇక ఏ దర్శనాలు, ఏ ఏర్పాట్లు ఉండవు కాబట్టి ఆ ఒక్క రోజు తిరుమలకు భక్తులు రాకుండా ఉంటేనే మంచిది. ఎందుకు అంటే ఇప్పటికే కొన్ని నిర్ణయాల వల్ల తిరుమలలో ఎక్కుడా హోటళ్ళు లేవు. దీంతో ఇప్పటికే భక్తులకు అన్నం తినడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ గ్రహణం సందర్బంగా అన్న ప్రసాద కేంద్రాన్ని మూసి వేస్తారు. కాబట్టి స్వామి దర్శనంతో పాటు…ఆ ఒక్క రోజు తినడానికి తిండి కూడా దొరకదు. కనుక బుదవారం తిరుమలకు భక్తులు రాకుంటేనే మంచిదని కొంత మంది టీటీడీ అదికారులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *