Home > Politics > ఇరవై నెలల్లో కాళేశ్వరంను పూర్తి

ఇరవై నెలల్లో కాళేశ్వరంను పూర్తి

ఏపీలో ముందస్తు ఎన్నికల వ్యూహం
విదేశీ పర్యటనలో చంద్రబాబు

harish-rao-apdunia-ముగిసిన హరీశ్ రావు రెండు రోజుల పర్యటన
-పనులపై హరీశ్ రావు సంతృప్తి

ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు రెండు రోజుల పాటు జరిపిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన ఆదివారం రాత్రి ముగిసింది. కాళేశ్వరం పనుల పురోగతి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర గవర్నర్ వెంట పర్యటించిన మంత్రి శనివారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా క్షేత్ర స్థాయి పర్యటన లు,సమీక్ష సమావేశాలు జరిపారు. శనివారం రాత్రి కాళేశ్వరం ప్యాకేజి 6, 7, 8 పనులను ముఖ్యంగా టన్నెల్ తవ్వకాల ను పరిశీలించి వాటి పురోగతిని అక్కడే సైటులో సమీక్షించారు.ఆదివారం ఉదయం గోలివాడ, సుందిళ్ళ,అన్నారం పంపు హౌజ్ ల పనుల పురోగతిని సమీక్షించారు. ఆదివారం సాయంత్రం కన్నెపల్లి పంపు హౌజ్ దగ్గర కాళేశ్వరం పనులపై ఇరిగేషన్ ఇంజనీర్లు, ఏజెన్సీ ల ప్రతినిధులతో సమీక్షించారు. కాళేశ్వరంను ఇరవై నెలల్లో పూర్తి చేయనున్నట్టు హరీశ్ రావు చెప్పారు.అత్యంత వేగంగా అటవీ, పర్యావరణ అనుమతులు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యపడిందన్నారు.గత ప్రాణహిత- చేవెళ్ల డిజైన్లో తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదని సి.డబ్ల్యు. సి తే ల్చడంతో సి.ఎం.కేసీఆర్ మేడిగడ్డను ఎంపిక చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు.వచ్చే జూన్, జూలై నాటికి సుందిళ్ళ, అన్నారం ఆనకట్టలను పూర్తి చేయడానికి పట్టుదలతో పని చేస్తున్నట్లు తెలిపారు.మేడిగడ్డ బ్యారేజీని 2018 చివరి నాటికి పూర్తి చేస్తామని హరీశ్ రావు ప్రకటించారు. కాళేశ్వరంప్రాజెక్ట్ పనుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని చెప్పారు.రోజుకు రెండున్నర లక్షల సిమెంటు బస్తాలు వాడుతున్నట్టు మంత్రి చెప్పారు. కన్నేపల్లి – అన్నారం ఆప్రోచ్ కాలువ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. వచ్చే మే నెలకల్లా ఈ కెనాల్ ను పూర్తి చేయాలని ఏజెన్సీ ని ఆదేశించారు.ఈప్రాజెక్ట్ పూర్తయితే 125 కిలోమీటర్ల మేర నదిలో 365 రోజుల మేర నీరు నిల్వ ఉంటుందన్నారు. సుందిళ్ళ, అన్నారం, మేడి గడ్డ ఆనకట్టలపై జాతీయ రహదారుల ప్రమాణాలతో రోడ్ బ్రిడ్జ్ లు నిర్మిస్తున్నట్టు మంత్రి తెలియజేశారు. భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పంట పొలాలకు నీరిచ్చేలా చిన్నపాటి ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు.మంథని అసెంబ్లీ నియోజకవర్గం లోని ప్రతి ఎకరానికి సాగు నీరందుతుందన్నారు. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రెండో దశ అటవీ అనుమతులు వచ్చినందున ఈ పథకం త్వరగా పూర్తి చేసి రెండు పంటలకు నీరివ్వాలని ఆదివారం సాయంత్రం కన్నెపల్లి పంపు హౌజ్ దగ్గర సమీక్ష లో ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో పేద్దపల్లి జిల్లా మంథని రూపు రేఖలు మారనున్నట్టు మంత్రి హరీశ్ రావు అన్నారు.అటు ఎస్.ఆర్.ఎస్.పి,ఇటు కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం, మంథని లిఫ్ట్ పథకాలతో మొత్తం మంథని అసెంబ్లీ నియోజక వర్గం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. కాళేశ్వరం గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. మత్స పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుందన్నారు. నౌకాయానం అభివృద్ధి జరుగుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.చిన్న కాళేశ్వరం లిఫ్టు తో మంథని లో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన చెప్పారు.”శభాష్ హరీశ్”అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పొగిడారు. మంత్రి భుజం తట్టి అభినందించారు.కన్నేపల్లి ప్రధాన పంపుహౌజ్ సహా అన్నారం,సుందిళ్ళ బ్యారేజీ లను గవర్నర్ నరసింహన్ సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ పనులను ఏరియల్ సర్వే ద్వార పరిశీలించారు.మంత్రి హరీశ్ రావు పనితీరు, తపన, ఆయన శ్రమ కు గవర్నర్ ముగ్దుడయ్యారు.అలాగే ఇరిగేషన్ రంగంపైనా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దాని ఫలితాలపైనా మంత్రి అవగాహన,పట్టు గవర్నర్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మంత్రి భుజం తట్టి ప్రశంసించారు. కీపీటప్ అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు తో దాదాపు 125 కిలోమీటర్ల దూరమంతా గోదావరిని సజీవంగా ఉంచేందుకు రచించిన ప్రణాళికలు, అమలు చేస్తున్న తీరు, ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు జీవనాధారంగా ఎలా మారుతుందో గవర్నర్ కు కాచి వడబోసిన చందంగా హరీశ్ రావు వివరిస్తుంటే గవర్నర్విస్తుబోయారు.హరీశ్ రావు సాధికారత,ఆత్మవిశ్వాసం,నిబద్ధత పట్ల ఆశ్చర్య పోయారు. కాళేశ్వరం ఇండియా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి దిక్సూచి అవుతుందో గవర్నర్ కు హరీశ్ వివరించారు. ,పరుగులుపెడుతుంది. రైతుల ఆత్మ కేసీఆర్ అయితే తెలంగాణ ప్రజల ఆత్మ గా కాళేశ్వరం రూపుదిద్దుకుంటున్నదని మంత్రి చెప్పారు.టి.ఎస్.లో రైతు ఆత్మహత్యలను నివారించడానికి కాళేశ్వరం ఒక్కటే శరణ్యం అని గవర్నర్ కు వివరించారు. మూడు బ్యారేజీలు,మూడు పంపు హౌజ్ లు, గ్రావిటీ కెనాల్ నిర్మాణాలు జరుగుతున్న తీరు, వేలాదిమంది కార్మికులు,యంత్రాల ధ్వని తో కాళేశ్వరం ప్రాంతం మారుమోగుతుండడం పట్ల నరసింహన్ నివ్వెర పోయారు. క్షేత్రస్థాయిలో ఆయన సమస్యలు తెలుసుకున్నారు.ఈ ప్రాజెక్టు కోసం జరుగుతున్న పనులు,దీనికయ్యే విద్యుత్తు, టి.ఎం.సి.లు,మోటార్లు, పంపులు, వాటి బిగింపు షెడ్యూల్ గురించి గవర్నర్ ఎంతో ఆసక్తి గా తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రమే ‘నీళ్ళు, నిధులు, నియామకాల ‘ డిమాండ్ తో పోరాడి తెచ్చుకున్న విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. కోటి ఎకరాల సాగునీటి కల్పన లక్ష్యంతో సీఎం కెసిఆర్ ముందుకు పోతున్నారని చెప్పారు..18 .80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం,మరో18 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకురావడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను హరీశ్ రావు వివరించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరువరకు నీటి తరలింపునకు అనుగుణంగా పనులు పూర్తవుతున్నవని గవర్నర్ కు లెక్కలతో మంత్రి సోదాహరణంగా వివరించారు. మోటర్లను ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారని అన్నారు. ఇందులో అత్యంత కీలకమైన ప్యాకేజీ-8లోని పంపుహౌజ్లో భారీ మోటర్ డ్రైరన్కు కూడా అధికారులు ఏర్పాట్లుచేశారని గవర్నర్ కు తెలిపారు. పెద్ద లిఫ్టు పథకం.ఇందులో ఒక్కో మోటరు 600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్నవి. ఎల్లంపల్లికి నీటిని తరలించిన తర్వాత గ్రావిటీపై జలాలు మేడారం రిజర్వాయర్కు వస్తాయని, మేడారం రిజర్వాయర్ నుంచి 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు మోటర్లతో నీటిని లిఫ్టు చేస్తామని,రామడుగు వరకు వచ్చిన ఆ నీటిని అక్కడి పంపుహౌజ్ నుంచి 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు మోటర్ల ద్వారా ఎత్తి ఎస్సారెస్పీ వరద కాల్వలో పోస్తామని హరీశ్ రావు కన్నెపల్లి పంపు హౌజ్, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల దగ్గర ఏర్పాటు చేసిన మ్యాప్ లను చూపుతూ హరీశ్ రావు వివరించారు. దీంతో జలాలు మిడ్మానేరుకు చేరుతాయని, రామడుగు వద్ద ఉన్న పంపుహౌజ్లో బిగించిన 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్కు డ్రైరన్కు సన్నాహాలు సాగుతున్నవని తెలియజేశారు.రామడుగు పంపుహౌజ్లో బిగించే ఒక్కో మోటర్ద్వారా సుమారు 3001 క్యూసెక్కుల డిశ్చార్జి ఉంటుందని వివరించారు. ఏడు మోటర్ల ద్వారా రెండు టీఎంసీలు ఎత్తిపోయనున్నట్టు హరీశ్ రావు తెలిపారు. ఎల్లంపల్లి-మిడ్ మానేరు మార్గాన్ని సిద్ధం చేసుకొని మేడారం, అన్నారం, సుందిల్ల పంపుహౌజ్లోనూ మోటర్ల ట్రయల్న్స్ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. బరాజ్లు పూర్తికాకున్నా కొంతమేర పని అయినా రోజుకు రెండు టీఎంసీలను ఎత్తిపోసేలా నీటి లభ్యత ఉంటే సరిపోతుందన్నారు. మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు పనులు కొనసాగుతున్నాయని రోజుకు రెండున్నర లక్షల బస్తాల సిమెంట్ ను కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వాడుతున్నట్లు మంత్రి చెబుతున్నప్పుడు గవర్నర్ విస్తుపోయారు. మరోవైపు ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు వరకు జలాల తరలింపు పనులు ప్యాకేజీ-6 నుంచి 8 వరకు పూర్తి చేయాలన్న టార్గెట్ తో ప్రభుత్వం పని చేస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు.నదిలో కాళేశ్వరం వద్ద నీరు పుష్కలంగా ఉన్నట్లు సి.ఎం. గుర్తించారు. సి.డబ్ల్యు. సి. సూచనల మేరకు జలాశయాల సామర్థ్యాన్ని 11 టీఎంసీల నుంచి 147 టీఎంసీలకు పెంచామని మంత్రి చెప్పారు. రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టు ను రీ-డిజైన్ చేశారని గవర్నర్ కు హరీశ్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *