Home > Bhakti > తిరుమలకు భక్తుల పోటు

తిరుమలకు భక్తుల పోటు

రాహుకేతు పూజా టికెట్ల ధర రూ. 500కి పెంపు
గరుడ వాహన సేవకు పోటెత్తిన భక్తులు

tirumala-ttd-apduniaతిరుమలలో గురువారం ఆరో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా రుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగారు. వరుస సెలవులు రావడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను సరఫరా చేస్తున్నారు. కాగా ఉత్సవాల్లో ఆరవరోజు గురువారం ఉదయం హన్మంతవాహనం, సాయంత్రం స్వర్ణరథంపై విహరించనున్నారు. ఏడుకొండలవాడి వైభవాన్ని తిలకించడానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *