Home > Politics > కోర్టులు మీకెలా కనిపిస్తున్నాయి

కోర్టులు మీకెలా కనిపిస్తున్నాయి

ఇండియాలో వారసత్వ రాజకీయాలు సాధారణం
మళ్లీ లోకేష్ తడబడ్డాడు

gutha-sukender-reddy-apdunia-గుత్తాపై హైకోర్టు సీరియస్

నల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిపై హైకోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులను నియమించి వారికి మంత్రి హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ అయన గతంలో పిల్ వేశారు. ఈ అంశం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. అయితే సదరు పిటిషన్‌ను ఉపసంహ‌రించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ.. గుత్తా తరఫు లాయర్ హైకోర్టును కోరారు. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి తీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా వాడుకోవద్దని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ ఉపసంహ‌రణకు అనుమతి నిరాకరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. పిటిషనర్‌ వెనక్కి తగ్గినా తాము విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఈ పిల్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిన గుత్తా.. టీఆర్ఎస్‌లో చేరారు. మరోవైపు గుత్తాతో ఎంపీ పదవికి రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తద్వారా 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ సత్తా ఏంటో నిరూపించాలని కూడా టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *