Home > Crime > గంజాయి దందాలో హిజ్రాలు

గంజాయి దందాలో హిజ్రాలు

బ్లాక్ మనీ ఎంతో వచ్చిందో తెలియదు
2009 నాటి డొంక కదులుతోంది

ganjai-hizra-apduniaవిశాఖలో గంజాయి రవాణా మాఫియా బరితెగిస్తోంది. మరణాయుధాలతో గంజాయిని తరలిస్తూ పట్టు బడిన నలుగు సభ్యుల చర్య పోలీసులను సైతం ఉలిక్కి పడేలా చేసింది. ఇంత కాలం గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని మాత్రమే రవాణా చేసే అక్రమార్కులు, ఇప్పుడు అతి ప్రమాదకరమైన వెపన్స్ తో తీరగడం శాఖ ఏజెన్సీలో కలకలం రేపింది. విశాఖ ఏజెన్సీ అక్రమ గంజాయి రవాణాకు అడ్డగా మారింది. గంజాయి పంటకు అనుకూలమైన ప్రాంతాల్లో పంట సాగు చేస్తూ ఇతర రాష్ట్రాలకు సైతం రవాణా చేసే ముఠా సభ్యుల సరసన ఇప్పుడు హిజ్రాలు చేరిపోవడంతో మరింత ఆందోళనకు గురి చేస్తోంది. విశాఖ ఏజెన్సీలో గంజాయి రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. గంజాయి రవాణాలో ఇప్పుడు వారి చెంతన హిజ్రాలు కూడా చేరిపోయారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నేల్లిమెట్ట వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేశారు. చింతపల్లి నుండి వస్తున్న ఆటో లో 180 కేజీ ల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. నలుగురు అరెస్టు చేసిన పోలీసులు ఒకరు హిజ్రాగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *