Home > General > గుర్రపు డెక్కలతో నిండిపోయిన కాల్వలు

గుర్రపు డెక్కలతో నిండిపోయిన కాల్వలు

ఆకాశంలో జన్మించాడు.... బంపర్ ఆఫర్ కొట్టాడు
తిరుపతి సిగలో "సెల్‌" పువ్వు

drinage_apduniaపశ్చిమగోదావరి జిల్లా వీరవారం మండలంలో ప్రవహిస్తున్న పలు మురుగు కాలువలు గుర్రపుడెక్క, తూడుతో పూడిపోయి ఉన్నాయి. పేరుకుపోయిన తూడును సకాలంలో తొలగించకపోతే రానున్న సార్వా ఆకుమడులకు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉంది. మండలంలో ప్రధానంగా గొంతేరు, బసవరాజు మురుగు కాలువలున్నాయి. అలాగే మైనర్‌డ్రెయిన్‌లుగా పొలమూరు మురుగు కాలువ, రాణి కోడు, తొక్కోడు లాంటి మురుగు కాలువలు చేలల్లోని మురుగును తీసుకునిపోతుంటాయి. ముందస్తు సార్వాసాగు పేరుతో వ్యవసాయాధికారులు రైతులను నారుమడులకు సన్నధ్ధం చేస్తున్నారు. ఈ విధంగా జూలై చివరి నాటికి వివిధ దశలల్లో రైతులు నారుమడులను సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. మండలంలో జూలై చివరి నాటికే సార్వానాట్లు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రుతుపవనాలతో అక్కడక్కడ వర్షాలు
కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది. ఈ నేపథ్యంలో మురుగు కాలువల్లోని తూడు తొలగించకపోతే ప్రవాహానికి ఆటంకం ఏర్పడి నారుమడులకు నష్టం వాటిల్లే ఆవకాశం ఉంది. పొలమూరు మురుగు కాలువలో స్థానికులు అనేక వ్యర్థాలను వేయడంతో కాలువ పొడవునా చెత్త పేరుకుపోయింది. ఇదే కాలువపై కొత్తగా నిర్మిస్తున్న మరో వంతెన పనులు ఇంకా కొనసాగు తున్నాయి. గతంలో ఈ మురుగు కాలువలో చెత్తవల్ల మురుగు నీరు కిందకు పారక ఎగువనున్న తమ పంట పొలాలు ముంపునకు గురవు తున్నాయంటూ పొల మూరు రైతులు నరసాపురం ఆర్‌డిఒకు ఫిర్యాదు చేశారు. ఇదే విధంగా గొంతేరుపై రెండో రైలు మార్గం నిర్మించనున్న నేపథ్యంలో వీరవాసరం వద్ద రైలు వంతెన పనులు సాగుతున్నాయి. ఇదే విధంగా మత్స్యపురిలో పాతవంతెన స్థానంలో కొత్త వంతెన పనులు చేపట్టారు. దీంతో అక్కడ మురుగు కాలువను 90 శాతం మట్టితో పూడ్చివేసి పనులు చేస్తున్నారు. ఈ విధంగా మండలంలో ప్రధాన మురుగు కాలువపై భారీ ఎత్తున పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తికావాలంటూ దాదాపుగా రెండు సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు అధికంగా పడితే కాలువ ప్రవాహానికి ఉన్న అడ్డంకుల వల్ల ఎగువ ప్రాంతంలోని నారుమడుల దశ నుండి కోతకోసే వరకూ తమ పట పొలాలకు ముంపు తప్పదనే ఆందోళనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క మైనర్‌ డ్రెయిన్‌లలో పేరుకుపోయిన తూడు, మరోపక్క మేజర్‌ డ్రెయిన్‌లలో జరుగుతున్న పనుల వల్ల సార్వసాగు మండలంలో ఏ విధంగా గట్టెక్కుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *