Home > Editorial > నాలుగేళ్లలో కమలం

నాలుగేళ్లలో కమలం

తెలుగు రాష్ట్రాలు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం
ఆత్మ విశ్వాసం మితి మీరితే ఇబ్బందులే

bjp-apdunia-ఏడు నుంచి 22 రాష్ట్రాలకు….

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రతిభను చూపింది. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్లుగా బీజేపీ త్రిపురలో విజయం సాధించడం ద్వారా శూన్యం నుంచి శిఖరానికి చేరింది. విజయం చిన్నదే అయినా విలువైన విజయంగా దేశవ్యాప్త సంకేతాలు పంపింది. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగా లాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినా, అవి ఆ పార్టీ ఈశాన్య రాజకీయ జైత్రయాత్రకు మైలురాళ్లుగా నిలిచాయి. త్రిపురలో వేర్పాటువాద ఇండిజీనియస్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)తో కలిసి పోటీ చేసిన బీజేపీ 25 ఏళ్ళ పాటు ఉనికిలో ఉన్న సీపీఎమ్ నేతృత్వంలోని వామపక్ష కూటమిని గద్దె దించింది. త్రిపురలో బీజేపీ 35 స్థానాల్లో, దాని మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ 8 స్థానాల్లోనూ విజయం సాధించింది. నాగాలాండ్‌లో బీజేపీ 11 స్థానాల్లోనూ, దాని మిత్రపక్షం అధికార పార్టీ నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీ ఎఫ్) 27 స్థానాల్లోనూ, తాజా మిత్రపక్షం నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) 16 స్థానాల్లోనూ విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అదేవిధంగా మేఘాలయలో బీజేపీ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించినా, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), యూడీపీ, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 38 స్థానాల్లో ఆ పార్టీకి అనుకూలురు విజయం సాధించడంతో వారందర్నీ కలుపుకొని మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి ప్రధాన కారణంగా స్థానిక ఆదివాసీ ప్రజల స్వయం పాల నాధికార డిమాండ్ సహా, ఆదివాసుల సమస్యలపై పోరాడుతున్న ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టడమే. రెండేళ్ళ క్రితం వరకు ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో నామమాత్రంగా ఉనికిలో ఉన్న బీజేపీ ప్రస్తుతం వాటిలో ఐదు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడమే కాక, మేఘాలయలో కూడా బీజేపీ అనుకూల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. మిజోరంలో బీజేపీ/ ఎన్డీఏయేతర ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఈ ఏడాది చివరలో జరుగబోతున్న ఆ శాసనసభ ఎన్నికలు ఎలాంటి తీర్పునిస్తాయో వేచి చూడాలి. జాతీయ స్థాయిలో ఏమంత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకోని ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏ సామాజిక, రాజకీయ అంశాలు దోహదం చేశాయి? అస్సాంలో ఐదుగురు, అరుణాచల్‌ప్రదేశ్‌లో 11 మంది, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో ఒకరిద్దరు శాసనసభ్యులు మాత్రమే ప్రాతి నిథ్యం ఉన్న బీజేపీ ఒక్కసారిగా అధికారంలోకి రావడానికి దోహదం చేసిన అంశాలేమిటి? ఈ ప్రాంతం నుంచి కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో క్రైస్తవ మతం ప్రబలంగా ఉన్నప్పటికీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఈ ప్రాం తంపై తన కాలాన్ని, వనరులను పెద్ద ఎత్తున వినియోగించడంలో పరమా ర్థమేమిటి? ఈశాన్య ప్రాంత ఆదివాసీలలో పాతుకుపోతున్న క్రైస్తవ మతాన్ని నిలువరించే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) సుదీర్ఘకాలంలో మారుమూల పర్వత ప్రాంతాలలో పనిచేయడం బీజేపీ విజయానికి పునాదులు వేసింది. అదీకాక ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు, వివిధ జాతుల స్వయం ప్రతిపత్తి ఆకాంక్షలను, డిమాండ్లను బీజేపీ స్వాగతించడంతో ప్రాంతీయ, జాతుల స్వయం నిర్ణయాధికార డిమాండ్‌పై పనిచేస్తున్న ప్రాంతీయపార్టీల మద్దతు లభించింది. అదీకాక జాతీయ సమగ్రత పేరుమీద ‘అఖండ్ భారత్’ అనే బీజేపీ నినాదానికి కీలకమైన ప్రాంతాలు దేశ సరిహద్దులేనని ఆ పార్టీ భావి స్తోంది. దాంతో దేశ ప్రధాన భూభాగానికి దూరంగా విసిరివేసినట్లు, బల హీనమైన ఆర్థిక, రాజకీయ అనుసంధానంతో కొనసాగుతున్న ఈశాన్య ప్రజా నీకాన్ని సంఘటితం చేయడంపై సంఘపరివార్ కొన్నేళ్లుగా కృషిచేస్తోంది. దాంతో ఈశాన్య రాష్ట్రాలు బీజేపీ రాజకీయ కార్యాచరణలో సరిహద్దులుగా కాక, కీలక వ్యూహాత్మక ప్రాంతాలుగా మారాయి. ఈశాన్య భారతంపై కాషాయి జెండా ఎగిరేందుకు ఈ నేపథ్యం దోహదం చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయపథం దేశవ్యాప్తంగా ప్రభావం ఇస్తాయని, సార్వత్రిక ఎన్నికల్లో ఈ విజయాలు అనుకూలిస్తాయని ఆ పార్టీ నాయకత్వం, శ్రేణులు జోరుగా ఊహాగానాలు చేస్తున్నాయి. రోడ్లు, వంతెనలు, నీటి సర ఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలతో ఈశాన్య భారతం దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ పక్షపాతం వైఖరి కారణంగా అభివృద్ధికి నోచుకోలేదు. అపార మైన సహజ వనరులకు ఆలవాలమైనప్పటికీ పారిశ్రామిక, వ్యవసాయక అభి వృద్ధి జరగలేదు. బ్రిటీష్ కాలం నాటి నుంచి పాలకుల వివక్షకు గురవుతున్న ఈశాన్య భారతంలో స్వయం నిర్ణయాధికార డిమాండ్‌తో జాతుల పోరాటాలు సఫలం కాలేకపోయాయి. పర్యవసానంగా స్వయంప్రతిపత్తి కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన డిమాండ్ చేసే ప్రాంతీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే ప్రగతి సాధ్యమనే నినాదంతో బీజేపీకి అది లాభిం చింది. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులను ప్రతిబింబిస్తూ వచ్చిన ఎన్నికల ఫలితాలను దేశావ్యాప్త సాధారణ ధోరణికి ప్రతీకగా భావించడం సరికాదు. అదీకాక ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఈసారి బీజేపీ తరపున పోటీ చేశారు గెలిచారు. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన అనుచర గణం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చి చేరడమే కాక, నాగా పీపుల్స్ ఫ్రంట్, సిక్కిం డెమొక్రటిక్ పార్టీలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా చేరడం కూడా బీజేపీకి కలసి వచ్చింది. త్రిపురలో కాబోయే ముఖ్యమంత్రి బిప్లాబ్ దేవ్ మినహా మిగిలిన వారెవ రూ బీజేపీ-ఆరెస్సెస్ మాతృక నుంచి వచ్చిన వారు కారు. ఆర్థికాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి పాలన సాగించినప్పటికీ మెజారిటీ ప్రజ లను ఓటు బ్యాంకులకు మార్చే దృక్పథం నుంచి బీజేపీ బయటపడి ఆదివాసీ తదితర మైనారిటీలకు అవకాశం కల్పించనంత వరకు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పాలన సాఫీగా సాగదు. ఆదివాసీల సంస్కృతి జీవనశైలికి వ్యతిరేకమైన గో మాంస నిషేధం వంటి అంశాలలో బీజేపీ రాజీపడక తప్పదు. ఏకీకృత హిందూ అస్తిత్వ నినాదంతో అధికారం కోసం మెజారిటీ సమూహ ఏకీకరణ కార్యకలాపం సుదీర్ఘకాలంలో విద్వేషకాండలకు దారితీసే ప్రమాదముంది. శూన్యం నుంచి శిఖరానికి చేరుకోవడం ఎంత కష్టమో, తేడా వస్తే శిఖరం నుంచి శూన్యానికి దిగజారడం అత్యంత సులభమనే సత్యాన్ని గుర్తించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *