Home > World News > ప్రపంచమంతా శాఖాహారులైతే ఎలా ఉంటుంది..

ప్రపంచమంతా శాఖాహారులైతే ఎలా ఉంటుంది..

ట్రంప్‌, పుతిన్ ర‌హ‌స్య భేటి
తీవ్రవాద సంస్థలతో బంధం తెంచుకోండి

healthy-vegetarian-apduniaప్రపంచం మొత్తం ఒక వేళ శాఖాహారులైతే ఏమవుతుంది… అలా జరిగితే దాదాపు 70 లక్షల మరణాలు తక్కువవుతాయట… 2050 నాటికి ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరు శాఖాహారం తింటే ఇది సాధ్యమేనని అధ్యయనకారులు తెలిపారు. నిజానికి శాఖాహారం తింటే గుండె జబ్బులు రావట. డయాబెటిస్, గుండె పోటుతోసహా క్యాన్సర్ కు సంబంధించిన అనేక రోగాలు మటుమాయమవుతాయట. అలాగే రోగాలబారిన పడి చికిత్సల కోసం చేసే ఖర్చు కూడా 2 నుంచి 3 శాతం తగ్గిపోతుందట. ఆక్స్ ఫర్డ్ మాటిన్్ స్కూల్ ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రకారం మాంసాహారం మానివేయడం హాని చేకూర్చే గ్యాస్ కూడా తగ్గిపోతుందట. రెడ్ మీట్ ను తినకపోవడం వల్ల హానికారక మిథేన్ గ్యాస్ మాయమవుతుంది. మిథేన్ గ్యాస్ తగ్గుదలతో నీరు, వాయువులోనూ మార్పు వస్తుందని, వీటిపై పడే ప్రభావం కూడా తగ్గుతుందట. జనం మాంసం తినడం మానేస్తే ఎంతో లాభంతోపాటు కొంత నష్టం కూడా ఉంది. బంజరు భూములున్న ప్రాంతాల్లో పశువుల పెంపకం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. వారు వారి వృత్తిని మానుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో వారి సంస్కృతి ప్రమాదంలో పడే అవకాశముంది. పశుపోషణపై ఆధారపడే రైతులు ఇతర కొత్త పనులను నేర్చుకోవాల్సి ఉంటుంది. మాంసాహారాన్ని మానివేయడం వల్ల లాభమో నష్టమో అర్థం చేసుకోవాల్సిన అవసరం మీ చేతుల్లోనే ఉంది. ఇక మనదేశం విషయానికి వస్తే మాంసం తినేవారి సంఖ్య తగ్గుతోంది. జనాభా పెరుగుదలను లెక్కించే ఓ ఏజెన్సీ ప్రకారం గడిచిన పదేళ్లలో నాలుగు శాతం మాంసం తినేవారి సంఖ్య తగ్గింది. 2004లో 15ఏళ్లకు పైబడిన వారు 75 శాతం మాంసాహారులుంటే.. 2014లో వారి సంఖ్య 71 శాతానికి పడిపోయింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *