Home > Crime > సౌదీలో హైదరాబాద్ యువకుడికి ఎలాంటి శిక్ష వేశారో తెలుసా?

సౌదీలో హైదరాబాద్ యువకుడికి ఎలాంటి శిక్ష వేశారో తెలుసా?

ఫేస్‌బుక్‌లో అసభ్యకర మెసేజ్ లు పెట్టాడు..ఊచలు లెక్కబెడుతున్నాడు
ఫ్యాక్షన్ హత్యకేసులు ఎనమిదిమందికి యావజ్జీవం

soudi-young-person-apduniaసౌదీలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయన్న విషయం విదితమే. హైదరాబాద్ నుంచి ఉద్యోగం కోసం రియాద్ వెళ్లిన హైదరాబాద్ యువకుడు అక్కడ ఒక దొంగతనం కేసులో ఇరుక్కున్నాడు. ఆయనకు సౌదీ కోర్ట్ ఒక సంవత్సరం జైలు, 300 కొరడా దెబ్బలు శిక్ష విధించింది. హైదరాబాదులో ఉన్న అతని తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకు నిర్దోషని, అన్యాయంగా అక్కడి కోర్టులు శిక్షిస్తున్నాయని వాపోతున్నారు. తమ కొడుకును కాపాడాలని విదేశాంగ శాఖా మంత్రి సుష్మ స్వరాజ్ ను వేడుకుంటున్నారు. హైదరాబాద్ మలక్ పేట్ కు చెందిన మహమ్మద్ మన్సూర్ హుస్సేన్ ఎంబీఏ చదివి 2013 నుంచి రియాద్ లో పని చేస్తున్నాడు. అతను గత ఏడాది ఆగష్టు 25న 1.06 లక్షల సౌదీ రియళ్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా గుర్తు తెలియని కొందరు దుండగులు అతడిని తుపాకీతో బెదిరించి అతని దగ్గర ఉన్న నగదును దోచుకున్నారని హుస్సేన్ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులకు చెప్పగా వారు తమ కుమారుణ్ణి అరెస్ట్ చేయించారని హుస్సేన్ తల్లి హూరున్నీసా చెప్పారు. ఇంతకుముందు కూడా తమ కుమారుడు 15 లక్షల రియాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేశాడని, ఇప్పుడు ఇంత చిన్న మొత్తానికి ఆలా ఎందుకు చేస్తాడని వాళ్ళు అంటున్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయంపై సాయం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *