Home > Health > వైద్యానికి జబ్బు

వైద్యానికి జబ్బు

గురకకు గుడ్‌బై చెప్పండి ఇలా..
పల్లెల్లో పొంచి ఉన్న డెంగ్యూ, మలేరియా

hospital   2_apduniaరోగాలను తగ్గించుకోవడానికి ఆసుపత్రికి వస్తే.. అక్కడేమో వేళకు రాని వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో 24 గంటలు వైద్య సేవలు అందుతాయన్న ప్రజల ఆశలు అడియాశలవుతున్నాయి. ఆస్పత్రుల ఆవరణల్లో పారిశుద్ధ్య పరిస్థితి మరీ దారుణంగాఉంది. స్వచ్ఛత కనిపించడం లేదు. రోగాలను నయం అవుతాయనుకుని వచ్చే అపరిశుభ్రతతో లేని రోగాలు వచ్చే పరిస్థితి డోన్ ప్రభుత్వాస్పత్రిలో కన్పిస్తోంది.
 డోన్‌ ఆస్పత్రిని నేతలు, అధికారులు వంద పడకల ఆస్పత్రిగా మారుస్తుమని గతంలో హామీ ఇచ్చారు. ఇది నేటికీ నెరవేరలేదు. ఇక్కడి సూపరింటెండెంట్‌ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ కావడంతో ఖాళీ ఏర్పడింది. ఆ స్థానంలో కంటి డాక్టర్‌ కె.ఎల్‌.ఎన్‌. రాజు తాత్కాలిక బాధ్యతలు చేపడుతున్నారు. రోజూ వాంతులు, విరేచనాలు, తలనొప్పి, వైరల్‌, టైఫాయిడ్‌, దగ్గు, పడిశం, వంటి జబ్బులు ఉన్న వారు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఆసుపత్రి ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలో సూదులు, వాడిపడేసిన పరికరాలు, కొబ్బరి చిప్పలు ఎక్కడ పడితే అక్కడ కన్పిస్తున్నాయి. రోగులు, వారి బంధువులు కట్టలపై కూర్చొని భోజనం చేస్తుంటే పందులు గుంపులు గుంపులుగా వస్తూ.. ఇబ్బంది పెడుతున్నాయి. పురపాలక కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని
వైద్యులు తెలిపారు. నలుగురు స్వీపర్లకు గాను ఒకరే పని చేస్తుండటంతో ఆసుపత్రి, దాని పరిసరాలు శుభ్రం చేయలేని పరిస్థితి నెలకొంది.

  • 30 పడకల ఆసుపత్రిలో మంగళవారం, శుక్రవారం రోజుల్లో సగటున 30 నుంచి 40 మంది దాకా ట్యుబెక్టమీ చికిత్సలు జరుగతాయి. సిజరిన్‌ విభాగానికి సంబంధించి నెలకు సగటున 20 దాకా కాన్పులు
    జరుగుతుంటాయి..అయినా వసతులు లేని కారణంగా వచ్చిన వారు ఇబ్బందులు పడాల్సి వసోంది.
  • ఆసుపత్రి ప్రాంగణంలో మృతదేహాలకు పోస్టుమార్టరం చేసే గది శిథిలావస్థకు చేరుకుంది. దానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా..కార్యరూపం దాల్చలేదు. ఆసుపత్రి ప్రాంగణంలోనే
    బ్రిటిష్‌ కాలం నాటి భవనంలో హోమియోపతి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంటోంది.  బేతంచెర్లలోని ఆసుపత్రికి రోజుకు 250 నుంచి 300 మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు . మండలంలో 90వేల జనాబా ఉంది. ఇక్కడ ఆరుగురు వైద్యులకు గాను నలుగురు పని చేస్తున్నారు.
    డెక్కన్‌క్రాన్‌, డైక్లోఫిన్‌, జెంటామైసిన్‌, అవిల్‌ తదితర మందులు, సూదుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు వెళ్లి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *