Home > Latest News > డిపాజిట్లు పై అధికారుల దృష్టి

డిపాజిట్లు పై అధికారుల దృష్టి

గంగూలీకి బెదిరింపు లేఖ
చంద్రబాబు కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే: ఎమ్మెల్సీ సతీష్

deposits_apduniaపెద్దనోట్ల రద్దయినప్పటి నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు బ్యాంకు డిపాజిట్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు బ్యాంకుల ఖాతాల వివరాల కోసం బ్యాంకులకు లేఖలు రాశారు. పెద్దనోట్ల రద్దుకు ముందు జీరో, అంతంత మాత్రంగానే నగదు లావాదేవీలు జరిగే అకౌంట్‌లలో ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు జమ అవుతుండటంతో ఈ దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆయా ఖాతాల ఆధారంగా వారి వివరాలు సేకరిస్తున్నారు. భారీగా నల్లధనాన్ని కూడబెట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చే వారి వివరాలు బయటపడనున్నాయి. పెద్దనోట్ల రద్దయిన తర్వాత జరిగిన లావాదేవీలకు సంబంధించిన వివారాలను బ్యాంకర్లు ఇప్పిటకే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందేజేశారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు 2016 ఏప్రిల్ 1 నుంచి నవంబరు 8 వరకు జరిగిన లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబరు 8వరకు పొదుపు ఖాతాల్లో జరిగిన డిపాజిట్ల వివరాలు సమర్పించాలని బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్టాఫీసులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో బ్యాంకుల అధికారులు వివరాల సేకరణలు ఉన్నారు. ఖాతాదారులందరి నుంచి పాన్ వివరాలు లేదా పాన్ లేని వారు ఫాం -60 ని తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు నిర్దేశించింది. ఫిబ్రవరి 28లోగా అన్ని బ్యాంకులు ఈ చర్యలు చేపట్టాలని సూచించింది. జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాలు ప్రజలు ఎక్కువగా ఉండటంతో ఖాతాదారులకు ఇబ్బందులు పడనున్నారు. ఆదాయపు పన్ను ఎగవేతను నిరోధించడానికి ఖాతాదారులందరి నుంచి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) వివరాలు లేదా పాన్ లేని వారు ఫాం-60 ని తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. ఫిబ్రవరి 28లోగా అన్ని బ్యాంకులు ఈ చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనలు సవరించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ద్వారా నోటిఫికేషన్ జారీ అయింది. నిబంధన జన్‌ధన్ సహా జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలు, ప్రాథమిక పొదుపు డిపాజిట్ ఖాతా ( బీఎస్‌బీడీఏ) వర్తించదని స్పష్టం చేసింది. ప్రజల సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి బీఎస్‌బీడీఏలను ప్రవేశపెట్టారు. వీటికి ఏటీఎం కార్డు, నెలవారి స్టేట్‌మెంట్, చెక్కుబుక్కు ఉచితంగా ఇస్తారు. ఇటువంటి ఖాతాల్లో పెద్దమొత్తంలో బ్యాలెన్స్ ఉంటే వాటి నుంచి నగదును తీసుకోడానికి పాన్ లేదా ఫాం-60 వివరాలు ఉంటే అనుమతించాలని గత నెల రిజర్వు బ్యాంకు ఆదేశించింది. ఈ విధానాన్ని తప్పని సరి పాటించాలని పేర్కొంది. కొత్త నిబంధన ప్రకారం పాన్ లేదా ఫాం-60 తీసుకున్న ఖాతాదారుల వివరాలను బ్యాంకు అధికారులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పాన్ లేదా ఫాం-60 సమర్పించని ఖాతాదారులు ఫిబ్రవరి-28 లోగా వాటిని తీసుకుని బ్యాంకులకు సమర్పించాలి.
సేవింగ్ ఖాతాలు 10,78,429, లోన్ శాతాలు 11,389, జనధన్ ఖాతాలు 3,44,553 మొత్తం 14,34,401 కార్డులున్నాయి. జన్‌ధన్ ఖాతాదారులకు పాన్ లేదా ఫాం-60 నుంచి మినహాయింపు నివ్వగా సేవింగ్ ఖాతాలు, లోన్ ఖాతాలు కలిపి 10,89,818 ఖాతాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *