Home > World News > National > వ్యూహాత్మకంగా భారత్ అడుగులు

వ్యూహాత్మకంగా భారత్ అడుగులు

వీసాలపై ఆందోళన వద్దు : నిర్మలా సీతారమన్

United_Apduniaఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుతున్న భారత్ తాత్కాలికంగా వీటో హక్కును వదులుకోవడానికి కూడా సిద్ధమౌతోంది. భద్రతా మండలిలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉన్న ది. వీటికి వీటో హక్కు కూడా ఉన్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా మరికొన్ని దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే వాదన ఎంతో కాలంగా ఉన్నది. భారత్, జర్మ నీ, బ్రెజిల్, జపాన్ దేశాలు జీ 4 కూటమి గాఏర్పడి భద్రతా మండలి సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నాయి. వివిధ దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు సాగుతున్నప్పుడు జీ4 దేశాల తరఫున భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలపై త్వరగా చర్చలు ప్రారంభించాలని కోరారు. మిగతా దేశాలకు వీటో హక్కు ఇవ్వడానికి ఐదు శాశ్వత సభ్య దేశాలు సిద్ధంగా లేవు. పదిహేనేండ్ల పాటు కొత్త శాశ్వత సభ్య దేశాలు వీటో హక్కును వాడుకోకూడదనే ప్రతిపాద న ఒకటి తెరపైకి వచ్చింది. వీటో హక్కు లేని శాశ్వత సభ్యత్వం వల్ల ఫలితం ఉండదు. అయినప్పటికీ జీ4 దేశాలు వీటో హక్కు లేని శాశ్వత సభ్యత్వం వైపు మొగ్గు చూపుతున్నాయి. వీటో హక్కు వదులుకోవడం తమకు ఇష్టం లేనప్పటికీ, దీని కారణంగా చర్చలు నిలిచి పోకూడదని ఈ ప్రకటన చేసినట్టు భారత్ ఆ తరువాత వివరణ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల పై కనీసం చర్చలు కూడా జరగడం లేదు. మొదట చర్చలు ప్రారంభింపజేయాలని జీ4 దేశాలు భావిస్తున్నాయి. తమకు ఆఫ్రికా ఖండం నుంచి మరో రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం సాధించాలని జీ4 దేశాలు పట్టుదలగా ఉన్నాయి. భద్రతా మండలి సభ్యత్వానికి అర్హత ఉన్న వర్ధమాన దేశాలు ఈ వేదిక విస్తరణకు కృషి చేస్తున్నా యి. భారత్ ఈ కోవలోకి వస్తుంది. కానీ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందే అవకాశం లేని పాకిస్థాన్ వంటి దేశాలు విస్తరణను అడ్డుకుంటున్నాయి. యూరప్‌లో జర్మనీ సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుంటే, ఈ విషయం గిట్టని ఇటలీ వ్యతిరేకిస్తున్నది. ఈ విధంగా జీ4 దేశాలను వ్యతిరేకించే 13 దేశాలు యునైటింగ్ ఫర్ కాన్సెన్సస్ పేర ఒక కూటమిగా ఏర్పడ్డాయి. భారత్‌కు భద్ర తా మండలి శాశ్వత సభ్యత్వం రావడం ఇష్టంలేని పాకిస్థాన్ ఇం దులో క్రియాశీల పాత్ర పోషిస్తున్నది. ఆఫ్రికా ఖం డం నుంచి రెండు దేశాలకు సభ్య త్వం ఇవ్వాలనే ఒక ప్రతిపాదన ఉన్నది. అయితే దక్షిణాఫ్రికా, ఈజిప్టుతో పాటు నైజీరియా కూడా సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నది. వీటిలో ఈ రెండు దేశాలు ఉండాలనే విషయమై ఆఫ్రికా దేశాలు ఏకాభిప్రాయానికి రావలసి ఉన్నది. అందుకే జీ 4 దేశాలు తమకు, మరో రెండు ఆఫ్రికా దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నాయి. అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాల ఒత్తిళ్ళు, పాకిస్థాన్ వంటి తోటి దేశాల వ్యతిరేకత మధ్య భద్రతా మండలి విస్తరణ కోసం జీ4 దేశాలు కృషి చేస్తున్నాయి. జీ4 దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభిస్తే యథావిధిగా వీటో హక్కు కూడా లభిస్తుంది. అయి తే వీటో హక్కును పదిహేనేండ్ల పాటు వాడుకోకూడదని, ఆ తర్వాత కూడా చర్చలు జరుపాలని, తాము అనుమతించిన తరువాతనే వీటో హక్కు వాడాలని ఐదు పెద్ద దేశాలు షరతులు పెడుతున్నాయి. ఎట్లాగైనా మొదట శాశ్వత సభ్యత్వం పొందాలని జీ4 దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఒక మెట్టు దిగి వీటో వదులుకునే షరతుకు వ్యతిరే కం కాదని ప్రకటించాయి. ఒకసారి చర్చలు అంటూ మొదలైతే వీలును బట్టి వ్యవహరించవచ్చు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉండటం, వాటికి వీటో అధికారం ఇవ్వడం ప్రజాస్వామ్య విరుద్ధమైన ఏర్పాటు. అయితే ఐక్యరాజ్యసమితి ఏర్పడిన 1940 దశకంలోని పరిస్థితి ప్రకారం ఈ ఏర్పాటు జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ శాంతి స్థాపనకు ఏర్పడిన నానాజాతి సమితి విఫలమైంది. రెండవ ప్రపంచ యుద్ధం రానే వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని పెద్ద దేశాలు ప్రపంచ శాంతికి బాధ్యత తీసుకునే విధంగా ఈ భద్రతా మండలిని రూపుదిద్దారు. ఈ ఐదు దేశాల ఆమోదంతో తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం తేలిక. ఈ ఐదు దేశాలలో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా, అటువంటి నిర్ణయాన్ని అమలు చేయడం కష్టం. దౌత్యమార్గంలో బలమైన పక్షాల ఆమోదంతో నిర్ణయాలు జరిగితే యద్ధానికి అవకాశం ఉండదు. పెద్ద దేశాలు కలిసి చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తే యుద్ధానికి అవకాశాలు తగ్గుతాయి. భద్రతా మండలి వల్ల అనేక సంక్షోభాలు పరిష్కారం అయ్యాయి. అదే విధంగా అనేక సమస్యలను పరిష్కరించలేక పోయింది. కానీ స్థూలంగా ప్రపంచ యుద్ధం వంటి ప్రమాదాలను నివారించింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సర్వ ప్రతినిధి సభను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు సాగాయి. కానీ భద్రతా మండలిలోని పెద్దదేశాల పట్టు సడలలేదు. ఈ పరిస్థితుల్లో భద్రతా మండలి విస్తరణ వల్ల తాము సభ్యత్వం పొందడంతోపాటు, ఆ వేదిక స్వరూప స్వభావాలను మార్చినట్టవుతుందని జీ4 దేశాలు భావిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *