Home > Sports > భారీ స్కోరు దిశగా భారత్

భారీ స్కోరు దిశగా భారత్

సెంచరీ బాదేసిన పుజరా
మిధాలి సేనకు గ్రాండ్ వెల్ కమ్

shikkar_apduniaశ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ డబుల్ సెంచరీ ముంగిట ఔటైపోయాడు. మ్యాచ్ తొలి సెషన్ నుంచి లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ ఎడాపెడా బౌండరీలు బాదిన ధావన్ (190: 168 బంతుల్లో 31×4) కెరీర్‌లో బెస్ట్ స్కోర్ అందుకున్న కొద్దిసేపటికే పెవిలియన్ చేరిపోయాడు. ఇన్నింగ్స్ 55 ఓవర్ బౌలింగ్ చేసిన ప్రదీప్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూస్ తలమీదుగా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు.కానీ.. ప్రదీప్ ఆఫ్ స్టంప్‌కి కొంచెం దూరంగా బంతి విసరడంతో.. షాట్‌ని అశించిన విధంగా ధావన్ కనెక్ట్ చేయలేకపోయడంతో బంతి నేరుగా మాథ్యూస్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో రెండో వికెట్‌కి అభేద్యమైన 253 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ 2013లో ఆస్ట్రేలియాపై చేసిన 187 పరుగులే టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది. తాజాగా ఆ స్కోరుని అధిగమించిన కాసేపటికే ధావన్ ఔటవడం విచారకరం.గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో శ్రీలంక క్రికెటర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రెండేళ్ల తర్వాత మళ్లీ టెస్టుల్లో శతకం బాదిన శిఖర్ ధావన్.. తొలి సెషన్‌లోనే శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌలర్ లాహిరు కుమార బౌలింగ్‌లో ధావన్ కొట్టిన బంతిని.. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అసేల గుణరత్నె క్యాచ్‌గా అందుకునేందుకు ప్రయత్నించాడు.అయితే.. బంతి వేగం, గమనాన్ని అంచనా వేయడంలో గుణరత్నె తడబడటంతో.. అతని ఎడమచేతి బొటనవేలిని చీల్చుకుంటూ బంతి వెళ్లిపోయింది. అప్పటికి ధావన్ స్కోరు 31 మాత్రమే. ప్రాథమిక చికిత్స అనంతరం గుణరత్నెని కొలంబోకి సర్జరీ కోసం తరలించినట్లు శ్రీలంక చీఫ్ సెలక్టర్ సనత్ జయసూర్య వెల్లడించాడు. మిడిలార్డర్‌లో గుణరత్నె గత కొంతకాలంగా మెరుగ్గా రాణిస్తున్నాడు. గాయం తీవ్రత నేపథ్యంలో దాదాపు ఈ మూడు టెస్టుల సిరీస్‌కి అతను దూరమయ్యే అవకాశం ఉంది. చెల రేగిన శిఖర్ ధావన్ తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ శతకంతో చెలరేగాడు. టెస్టు రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్‌ గాయం కారణంగా సిరీస్‌కి దూరమవడంతో జట్టులో చోటు దక్కించుకున్న ధావన్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 190 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. కేవలం 110 బంతుల్లో 16×4 సాయంతో కెరీర్‌లో శతకాన్ని అందుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 97 వద్ద పెరీరా బౌలింగ్‌లో స్వీప్ షాట్ ద్వారా బంతిని బౌండరీకి తరలించిన ధావన్ కెరీర్‌లో ఐదో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 2015లో గాలెలోనే శ్రీలంకపై ఈ ఓపెనర్ చివరి శతకం చేశాడు. ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ జ్వరం కారణంగా మ్యాచ్‌కి దూరమవడంతో అవకాశం దక్కించుకున్న అభినవ్ ముకుంద్ (12: 26 బంతుల్లో 2×4) నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లోనే ప్రదీప్ బౌలింగ్‌లో బంతిని ప్లిక్ చేసేందుకు ప్రయత్నించిన ముకుంద్ కీపర్ డిక్వెల్లా చేతికి చిక్కాడు. అనంతరం వచ్చిన పుజారా (46 నాటౌట్: 75 బతుల్లో 3×4)తో కలిసి ధావన్ భారత్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *