Home > General > ఎవ్వరికి వారే ఆధార్ వెరిఫికేషన్

ఎవ్వరికి వారే ఆధార్ వెరిఫికేషన్

కాన్పూర్ లో ఆస్థి కలాశ్ బ్యాంక్
గ్రాండ్ గా 78వ నూమాయిష్

aadhar-with-mobile-apduniaమీరు వాడుతున్న మొబైల్ నంబర్‌‌ను మీ ఆధార్ నంబర్‌‌తో రీ-వెరిఫై చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. దీనికి తగ్గట్టుగానే ఆయా టెలీకాం కంపెనీలు కస్టమర్లను ఆధార్‌తో మీ మొబైల్ నంబర్‌ను రీ-వెరిఫై చేసుకోవాలని కోరుతున్నాయి. చాలా మంది ఇప్పటికే తాము వాడుతున్న నెట్‌వర్క్‌కు చెందిన రిటైల్ స్టోర్లకు వెళ్లి ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను వెరిఫై చేసుకున్నారు.అయితే ఇంకా చేసుకోవాల్సిన వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అందుకే ఇప్పుడు ఈ ప్రక్రియను కేంద్రం మరింత సులభతరం చేసింది. ఇంటి నుంచే మీ మొబైల్ నంబర్‌కు ఆధార్ అనుసంధానం చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఐవీఆర్ పద్ధతి ద్వారా మీ ఫోన్ నుంచే ఈ ప్రక్రియను పూర్తిచేయొచ్చు. మీరు ఏ నెట్‌వర్క్ వాడుతున్నా ఒకే నెంబర్‌కు ఫోన్ చేసి ఆధార్‌ను లింక్ చేయొచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. మీ వెరిఫై చేసుకోవాల్సిన మొబైల్ నంబర్ నుంచి 14546కు కాల్ చేయాలి. అప్పుడు మీరు భారత పౌరుడా లేదా ఎన్ఆర్ఐ కస్టమరా అని అడుగుతుంది. మీరు ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత 1ని ప్రెస్ చేసి మీ ఆధార్ నంబర్‌ను పొందుపరచాలి. ఆధార్ నంబర్‌ను ఖరారు చేసుకోవడానికి మరొకసారి 1ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్‌కి ఒక వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూఐడీఏఐ డాటా బేస్ నుంచి మీ పేరు, ఫొటో, పుట్టినతేదీని మీ ఆపరేటర్ తీసుకోవడం మీకు సమ్మతమేనా అని ఇక్కడ అడుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *