Home > Crime > ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య

ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య

విదేశాల్లో భారత్‌ దౌత్య విజయం
ఆబు సలేంకు జీవత ఖైదు

chandini-murder-apduniaహైదరాబాద్ లో దారుణం జరిగింది. నగర పరిధిలోని మదీనాగూడలో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ఇంటర్మీడియట్ చదువుతున్న చాందిని జైన్ అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అమీన్ పూర్ కొండల్లో ఆమె మృత దేహం లభ్యంకాగా, దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న చాందిని, స్నేహితులతో పార్టీ ఉందని, వారిని కలసి వస్తానని మూడు రోజుల క్రితం ఇంట్లో చెప్పి వెళ్లిన చాందిని, ఆపై ఇంటికి తిరిగి రాకపోగా, తల్లిదండ్రులు పోలీసు రిపోర్టు ఇచ్చారు. ఆ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ చేసిన పోలీసులు, విచారిస్తుండగానే, అమీన్ పూర్ కొండల్లో ఓ యువతి మృతదేహం లభ్యమైందన్న సమాచారంతో అక్కడికి వెళ్లి, ఆమె చాందినిగా గుర్తించారు. ఆమెను హత్య చేసి కొండల్లో పడేశారని తేల్చిన పోలీసులు, అత్యాచారానికి గురైందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. చాందిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె మరణంతో ఆ కుటుంబం శోక సంద్రంలో నిండిపోయింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *