Home > Politics > జనం జేజేలు సరే…. ఓట్ల రూపంలోకి మారతాయా

జనం జేజేలు సరే…. ఓట్ల రూపంలోకి మారతాయా

బాలారిష్టాలు దాటని జనసేన
ఏడాదిగా సెక్రటేరియెట్ గడపెక్కని కేసీఆర్

ysrcp-apdunia100.. 500… 1000.. 15000 ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి దాటుతున్న మైలురాళ్లు. 2019లో ఓట్లు రాల్చే మెట్లుగా ఆ పార్టీ నేత‌లు న‌మ్ముతున్న యాత్ర‌లో కిలోమీట‌ర్లు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి మ‌ధ్య‌లో ఉప ఎన్నిక‌లు.. త‌రువాత ఓదార్పుయాత్ర‌, రైతుయాత్ర‌, ఇలా ప్ర‌తి రోజూ.. ఏదోరూపంలో ప్ర‌జ‌ల్లో త‌న పేరు గుర్తుండాల‌ని.. పార్టీ గుర్తు ఫ్యాన్ ముద్ర‌ప‌డాల‌నే రాజ‌కీయ వ్యూహంతో న‌డ‌క సాగిస్తూ వ‌స్తున్నారు. అయితే.. ఇప్పుడు చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర టార్గెట్ మాత్రం.. పూర్తిగా రాబోయే ఎన్నిక‌లే అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ రాయ‌ల‌సీమ జిల్లాల్లో స్పంద‌న సూప‌ర్ అంటూ నేత‌లు తెగ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. అయితే.. జ‌నం బాగానే వ‌చ్చినా ఓట్లు ఎంత వ‌రకూ త‌మ బ్యాలెట్‌లో ప‌డ‌తాయ‌నేది అంత‌ర్గ‌తంగా నాయ‌క‌గ‌ణాన్ని వేధిస్తున్న స‌మ‌స్యే. ఎందుకంటే.. ప్ర‌జారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి.. అప్ప‌ట్లో స‌భ‌లు, స‌మావేశాలు, ర్యాలీలు చేస్తే ఇసుకేసినా రాల‌నంత జ‌నం వ‌చ్చారు. కానీ.. ఓట్ల శాతం వ‌ద్ద కేవ‌లం 21 సీట్ల వ‌ద్ద‌నే ఆగిపోవాల్సి వ‌చ్చింది. వైసీపీ కూడా.. దాదాపు అధికారం ఖాయం అనుకున్నా.. చివ‌ర్లో బోల్తా ప‌డ‌క త‌ప్ప‌లేదు. ఇటువంటి గ‌త పాఠాలు.. యాత్ర‌కు వ‌చ్చిన జ‌నం.. ఓట్లేస్తార‌ని భావించ‌లేమంటూ పార్టీ నేత‌లు తేల్చి చెబుతున్నారు. మ‌రి ప్ర‌స్తుతం జ‌గ‌న్ యాత్ర‌లో జ‌నం సీమ‌లో జైజేలు ప‌లికారు. మ‌రి కోస్తా జిల్లాల్లో ఎలా ఉండ‌బోతుంది. ముఖ్యంగా.. గ‌త ఎన్నిక‌ల్లో ఓట్లు ప‌డ‌కుండా దూర‌మైన అర్బ‌న్ ఓట‌ర్లను ఆక‌ట్టుకుంటారా! బీజేపీతో దోస్తీ అంటూ చెప్పిన జ‌గ‌న్ త‌న మాట‌ల‌ను జ‌నానికి ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారు. న‌వ‌ర‌త్నాల మీద భార‌మేసిన ముందుకు సాగుతున్న యాత్ర‌లో లాభ‌మెంత అనేది తెలియాలంటే.. మ‌రో ఏడాది ఆగాల్సిందేనేమో!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *