Home > General > ప్రతి యేటా పన్నెండు రాకెట్ ప్రయోగాలు : ఇస్రో

ప్రతి యేటా పన్నెండు రాకెట్ ప్రయోగాలు : ఇస్రో

ఏజన్సీలో వినోదం అంటే కేవలం కోడిపందాలే
సూపర్‌స్టార్‌ కృష్ణ 'అసాధ్యుడు' చిత్రానికి 50 వసంతాలు

isro-launch-104-apduniaభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతి ఏటా పన్నెండు రాకెట్ ప్రయోగాలను లక్షంగా పెట్టుకొని పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ కిరణ్ కుమార్ అన్నారు .ఈ ఏడాది పీఎస్ ఎల్వీ – సీ 40 రాకెట్ ప్రయోగ విజయం తో విజయాల పరంపర ప్రారంభించిందని అన్నారు. మరిన్నీ అంతరిక్ష ప్రయోగాలతో పాటు చంద్రయాన్ వంటి ప్రయోగాలకు పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. శనివారం నాడు నెల్లూరు జిల్లా లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి పీఎస్ ఎల్వీ సీ 40 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం అయిన నేపధ్యంలో అయన మీడియాతో మాట్లాడారు. ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ ఈ ఏడాది చివరి లోగా మూడు జీఎస్ ఎల్వీ, తొమ్మిది పీఎస్ ఎల్వీ రాకెట్ ప్రయోగాలు చేయాలనీ నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే రెండవ ప్రయోగ వేదిక పైన జీఎస్ ఓల్వీ మార్క్ 2 రాకెట్ నిర్మాణం లో మొదటిదశ నిర్మాణం పూర్తి చేసుకుందని ఈ ఏడాది కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం కూడా జరుగుతుందని అన్నారు. వీటి తో పాటు గా చంద్రయాన్-2 ప్రయోగానికి డా తగిన పరిశోధనలను ఇస్రో సెంటర్స్ లో నిర్వహిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com